• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ అరెస్ట్.. వరుణ్...

బన్నీ అరెస్ట్.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే?

| ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ ను పలువురు ఖండించగా.. బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్ స్పందించారు. ఘటనలో ఒక్కరినే బాధ్యులను చేయడం సరికాదన్నారు.

By - Tupaki Desk
Update: 2024-12-13 11:26 GMT

హైదరాబాద్ లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కొడుకు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆ ఘటనకు సంబంధించి బన్నీపై బీఎన్ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

అయితే శుక్రవారం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు.. బన్నీని అరెస్ట్ చేశారు. కేసు విషయంలో చట్టప్రకారం ముందుకెళ్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ ను పలువురు ఖండించగా.. బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్ స్పందించారు. ఘటనలో ఒక్కరినే బాధ్యులను చేయడం సరికాదన్నారు.

వ‌రుణ్ ధావ‌న్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బేబీ జాన్ ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ అరెస్ట్ పై ఆయన మాట్లాడారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. సేఫ్టీ ప్రోటోకాల్ విషయంలో విఫలమైతే అది కేవలం నటుడి బాధ్యత మాత్రమే కాదని వరుణ్ ధావన్ జైపూర్ లో జరిగిన ఈవెంట్ లో వ్యాఖ్యానించారు.

అయితే పుష్ప 2 విడుద‌ల ముందు రోజు జ‌రిగిన సంఘటన విషాదకరమైనదని అన్నారు. ఆ విషయంలో తాను సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు తెలిపారు. కానీ తొక్కిసలాట ఘటనలో ఒకరిపై మాత్రమే నిందలు వేయలేమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వరుణ్ ధావన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంధ్య థియేటర్ లో ఏం జరిగింది?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కాగా.. డిసెంబరు 4వ తేదీన వివిధ ప్రాంతాల్లో ప్రీమియర్‌ షోలు ప్రదర్శించారు మేకర్స్. సంధ్య థియేటర్ లో కూడా ఏర్పాటు చేశారు.

ఆ సమయంలో అక్కడికి అల్లు అర్జున్ రాగా.. తొక్కిసలాట జరిగింది. దీంతో విషాదం చోటు చేసుకుంది. బన్నీ వచ్చిన సమయంలో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్‌ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు అల్లు అర్జున్ ను కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

Tags:    
  • Alluarjun 
  • Varundhawan 
  • Alluarjunarrest 
  • Alluarjunnews 
  • Alluarjunjailed 
  • Alluarjunremand 
  • Alluarjunlatestnews 
  • Sandhyatheatre 
  • Sandhyatheatrestampede 
  • Pushpa2 
  • Babyjohn 
  • Tollywood 
  • Allufamily 
  • Chanchalgudajail 
  • Filmindustry 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS