ఈ హీరోకు కామన్‌సెన్స్ లేదా..?
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ గురించి కొందరు సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విమర్శిస్తున్నారు.;
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ గురించి కొందరు సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విమర్శిస్తున్నారు. వరుణ్‌కి మినిమం కామన్‌సెన్స్ లేదని, ఒకరు ఒక విషయం గురించి సీరియస్‌గా మాట్లాడుతున్న సమయంలో ఎలా వ్యవహరించాలి అనేది కూడా ఆయనకు తెలియడం లేదు అంటూ నెటిజన్స్ వరుణ్ ధావన్‌పై విమర్శలు చేస్తున్నారు. ఆయన నటించిన సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో జరిగిన ఒక సంఘటన కారణంగా వరుణ్ ధావన్ విమర్శల పాలు అయ్యాడు. ఆయన తీరును ఏ ఒక్కరూ హర్షించడం లేదు, ఆయన చేసిన పనిని ఏ ఒక్కరూ సమర్ధించడం లేదు. ప్రతి ఒక్కరూ ఆయన ఖచ్చితంగా తప్పు చేశాడు, ఆ సమయంలో అలా స్పందించాల్సింది కాదు, ఆ సీరియస్ సమయంలో అలా కామెడీ చేయాల్సిన అవసరం లేదు అన్నట్లుగా చాలా సీరియస్‌గానే కామెంట్స్ చేస్తున్నారు.
సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా ప్రమోషన్‌లో..
సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమాలో వరుణ్ ధావన్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటించిన విషయం తెల్సిందే. అక్టోబర్ 2న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ప్రమోషన్‌లో భాగంగా జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ ఇతర యూనిట్ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ఇటీవల తన ఏఐ ఫోటో వైరల్ కావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తనకు సంబంధం లేని లొకేషన్‌లో, తాను ధరించని ఔట్ ఫిట్‌లో తనను చూపించారు అంటూ జాన్వీ కపూర్ అంతకు ముందు కూడా ఆ ఫోటోలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, లీగల్ చర్యలకు సిద్ధం అవుతున్నట్లుగా ప్రకటించింది. అంతే కాకుండా ఇలాంటివి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొంది.
జాన్వీ కపూర్ ఏఐ ఫోటో వివాదం
తాజా మీడియా సమావేశంలోనూ జాన్వీ కపూర్ అదే విషయాన్ని లేవనెత్తింది. ఏఐ అనేది వ్యక్తుల యొక్క ప్రైవేట్ జీవితాలను నాశనం చేయకుండా ఉండాలని, అంతే కాకుండా చాలా వరకు సోషల్ మీడియాలో వచ్చిన ఏఐ ఫోటోలను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచురించకూడదు అని విజ్ఞప్తి చేసింది. అలా సీరియస్‌గా తన ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో వరుణ్ ధావన్ పక్కనే ఉండి నవ్వుతూ ఈ సినిమాలో మాత్రం ఏఐను వినియోగించలేదు అంటూ చెప్పాడు. అతడు ఆ మాట అనడంతో జాన్వీ కపూర్ తన సీరియస్ స్పీచ్‌ను ఆపేయాల్సి వచ్చింది. వరుణ్ ధావన్ ఇంత కామన్‌సెన్స్ లేకుండా మాట్లాడుతాడని, ఒక అమ్మాయి తన బాధను చెప్పుకుంటూ ఉంటే ఇలాంటి ఇంట్రప్ట్ మాటలు, జోకులు వేయడం చేస్తాడని ఎప్పుడూ కనీసం అనుకోలేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
జాన్వీ కపూర్‌పై వరుణ్ ధావన్ జోకులు
జాన్వీ కపూర్ గత కొన్ని రోజులుగా ఏఐలో సర్క్యులేట్ అవుతున్న వైరల్ ఫోటోలపై ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత ఫోటోలను షేర్ చేయడం మంచిది కాదని ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో జాన్వీ కపూర్ ఏఐ ఫోటో వైరల్ కావడం, ఆమె తీవ్రంగా స్పందించడంతో ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనేది చూడాలి. ఇక జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే పరమ్ సుందరితో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ కపూర్ నిరాశ పరచింది. ఆ సినిమా ఫెయిల్ అయినప్పటికీ సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. సినిమా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అనుకుంటుంది. మరో వైపు టాలీవుడ్‌లో రామ్ చరణ్ కు జోడీగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.