• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కీర్తి సురేష్ 'బేబీ...

కీర్తి సురేష్ 'బేబీ జాన్'.. పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ కట్!

| బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, మహానటి కీర్తి సురేష్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ సినిమా ''బేబీ జాన్''.

By - Tupaki Desk
Update: 2024-11-04 09:21 GMT

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, మహానటి కీర్తి సురేష్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ సినిమా ''బేబీ జాన్''. కాలీస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను డైరెక్టర్ అట్లీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, అనౌన్స్ మెంట్ వీడియో ఆకట్టుకున్నాయి. దీపావళి కానుకగా నవంబర్ 1న థియేటర్లలో ఈ మూవీ టీజర్ కట్ ను మేకర్స్ ప్రదర్శించారు. తాజాగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేశారు.

''చీమ ఒంటరిగా ఉంటే ఈజీగా నలిపేయవచ్చు.. కానీ అన్ని చీమలు గుంపులుగా ఒకేచోట ఏకమైతే ఏనుగును కూడా పడగొట్టగలవు'' అని ఒక చిన్న పాప వాయిస్ ఓవర్ తో 'బేబీ జాన్' టీజర్ ప్రారంభమవుతుంది. ఇందులో వరుణ్ ధావన్ ని మునుపెన్నడూ చూడని యాక్షన్‌ అవతార్ లో చూపించారు. ఓవైపు పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా, మరోవైపు తన కుమార్తెతో కలిసి సాధారణ జీవితం గడిపే వ్యక్తిగా రెండు పాత్రల్లో రెండు భిన్నమైన లుక్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లలో అదరగొట్టారు.

వరుణ్ ధావన్ భార్య పాత్రను కీర్తి సురేష్ పోషించింది. కీర్తి, వామికా గబ్బిలకు ఈ టీజర్ లో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనప్పటికీ, కనిపించిన ఒకటీ రెండు షార్ట్స్ లో తమ ఉనికిని చాటుకున్నారు. విలన్ బబ్బర్ షేర్‌గా సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ క్రూరమైన లుక్ లో కనిపించారు. ఎస్. థమన్ కంపోజ్ చేసిన బీజీఎమ్ ఈ టీజర్ లో హైలైట్ గా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ లో వినిపించే థీమ్ సాంగ్ అలరిస్తుంది. సినిమాటోగ్రాఫర్ కిరణ్ కౌశిక్ విజువల్స్ అదననపు ఆకర్షణగా నిలిచాయి. ప్రతి ఫ్రేమ్‌లో గ్రాండ్‌నెస్ కనిపిస్తుంది.

2016లో అట్లీ దర్శకత్వం వహించిన 'తేరీ' చిత్రానికి అఫిషియల్ హిందీ రీమేక్ గా ''బేబీ జాన్'' తెరకెక్కుతోంది. విజయ్, సమంత రూత్ ప్రభు, అమీ జాక్సన్ పోషించిన పాత్రల్లో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామికా నటించారు. ఒరిజినల్ కంటే చాలా గ్రాండ్ గా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో ఈ రీమేక్ ను రూపొందించినట్లు టీజర్ తో తెలుస్తోంది. ఇదే ఈ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.

'జవాన్' వంటి బ్లాక్ బస్టర్ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ అట్లీ.. ఇప్పుడు ''బేబీ జాన్'' సినిమాతో ప్రొడ్యూసర్ గా హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో ఏ ఫర్ యాపిల్ ప్రొడక్షన్స్, సినీ1 స్టూడియోస్‌ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియా అట్లీ, మురాద్ ఖేతాని, జ్యోతి దేస్ పాండే నిర్మాతలుగా వ్యవహరుస్తున్నారు.

క్రిస్మస్ స్పెషల్ గా 2024 డిసెంబర్ 25న ఈ సినిమాని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వరుణ్ ధావన్ నటించే హిందీ చిత్రాలను తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటారు. అయితే 'తేరి' రీమేక్ గా 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ రూపొందుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, 'బేబీ జాన్' తెలుగులో విడుదల కాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.

Full View
Tags:    
  • Babyjohnteaser 
  • Atlee 
  • Varundhawan 
  • Keerthysuresh 
  • Wamiqagabbi 
  • Jackieshroff 
  • Babyjohnmovie 
  • Bollywood 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS