వారణాసి టీజర్.. పారిస్ ఆడియన్స్ రియాక్షన్ ఏంటి..?

పారిస్ లోని లె గ్రాండ్ రెక్స్ తెర మీద వారణాసి గ్లింప్స్ రిలీజైంది. అక్కడ టీజర్ రిలీజైన తొలి ఇండియన్ సినిమాగా వారణాసి రికార్డ్ సృష్టించింది.;

Update: 2026-01-06 05:36 GMT

రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా టైటిల్ గ్లింప్స్ ఇండియాలో నవంబర్ 15న గ్రాండ్ గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ తోనే మహేష్ తో రాజమౌళి చేయబోతున్న అద్భుతాన్ని శాంపిల్ రుచి చూపించారు. ఐతే ఈ సినిమా లేటెస్ట్ గా వరల్డ్ బిగ్ స్క్రీన్ లో టీజర్ ప్రదర్శించబడింది. పారిస్ లోని లె గ్రాండ్ రెక్స్ తెర మీద వారణాసి గ్లింప్స్ రిలీజైంది. అక్కడ టీజర్ రిలీజైన తొలి ఇండియన్ సినిమాగా వారణాసి రికార్డ్ సృష్టించింది.

టైం ట్రావెల్ కథ.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో..

మహేష్ వారణాసి సినిమాలో టైం ట్రావెల్ కథతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడని అనిపిస్తుంది. ఐతే సినిమా తీయడం ఎలానో అదే రేంజ్ ప్రమోషనల్ ప్లానింగ్ తో వస్తాడు రాజమౌళి. అందుకే బాహుబలి, RRR సినిమాలు ఆఫ్టర్ రిలీజ్ ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ చేస్తే.. వారణాసి సినిమాకు మొదటి నుంచి అక్కడ ప్రమోట్ చేస్తున్నారు.

వారణాసి సినిమాను గ్లోబల్ రిలీజ్ ప్లానింగ్ ఉండగా సినిమా గురించి ఆడియన్స్ లో ఆసక్తి కలిగించేలా రాజమౌళి ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే పారిస్ లోని లీ గ్రాండ్ రెక్స్ థియేటర్ లో అతి పెద్ద తెర మీద వారణాసి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఐతే తెర మీద టీజర్ చూసిన ఆడియన్స్ అంతా సర్ ప్రైజ్ అయినట్టు తెలుస్తుంది. వారణాసి మేకర్స్ ఈ విషయాన్ని తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

1300 కోట్ల బడ్జెట్ తో ప్లాన్..

వారణాసి సినిమా టీజర్ లో చాలా విషయాలు దాచిపెట్టాడు రాజమౌళి. గ్లింప్స్ రిలీజైన టైం లో అందరు కూడా జక్కన్న ఇచ్చిన క్లూస్ ని కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే వారణాసి సినిమా 2027 మార్చి రిలీజ్ అని టాక్ రాగా.. లేటెస్ట్ గా రాజమౌళి డేట్ కూడా లాక్ చేశాడని అంటున్నారు. సినిమా ఏప్రిల్ 9, 2027 లో రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. రాజమౌళి మరో 7 నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసి మిగతా టైం అంతా ఎడిటింగ్ ఇంకా వి.ఎఫ్.ఎక్స్ పని మీద కూర్చుంటారని తెలుస్తుంది.

వారణాసి సినిమాలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ఆమె మందాకిని రోల్ చేస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్న ఈ సినిమాను 1300 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను కె.ఎల్ నారాణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు. వారణాసి సినిమాలో రుద్ర పాత్రలో మహేష్ నటిస్తున్నారు. సినిమాలో ఆయన రాముడిగా కూడా కనిపిస్తారని తెలుస్తుంది. ఫస్ట్ గ్లింప్స్ లో మహేష్ లుక్స్ మాత్రం ఫ్యాన్స్ కి సూపర్ ఫీస్ట్ అందించింది.



Tags:    

Similar News