• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హాలీవుడ్ లోకి వరలక్ష్మి...

హాలీవుడ్ లోకి వరలక్ష్మి శరత్ కుమార్.. ఏ మూవీ చేస్తుందంటే?

| నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ గురించి అందరికీ తెలిసిందే. కోలీవుడ్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మడు.. తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.

By - Tupaki Desk
Update: 2025-06-25 10:52 GMT

నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ గురించి అందరికీ తెలిసిందే. కోలీవుడ్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మడు.. తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. వేరే లెవెల్ లో తన సినిమాలతో మెప్పిస్తోంది. టాలీవుడ్ లో కూడా ఆడియన్స్ కు దగ్గరైంది. అన్ని భాషల్లో మంచి ఛాన్సులు ఆమె సొంతమవుతున్నాయి.


టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుందనే చెప్పాలి. ఇప్పుడు హాలీవుడ్ లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది వరలక్ష్మి. వెటరన్ డైరెక్టర్ చంద్ర రత్నం దర్శకత్వం వహిస్తున్న RIZANA-A Caged Bird మూవీతో హాలీవుడ్ లో ఆమె సందడి చేయనుంది. బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ సరసన కనిపించనుంది.


వాస్తవ సంఘటనల ఆధారంగా మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం శ్రీలంకలో షూట్ చేస్తున్నారు మేకర్స్. త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు. అయితే వరలక్ష్మికి ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ప్రియులు, పలువురు సెలబిట్రీలు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.


ఇక వరలక్ష్మి కెరీర్ విషయానికొస్తే.. మొదట హీరోయిన్ గా అరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత లేడీ విలన్ గా మారిపోయింది. పోదా పొడి మూవీ ఆమె సినీ జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటించిన వరలక్ష్మి.. లేడీ విలన్ గా ఛేంజ్ అయిన విషయం తెలిసిందే. తన నటనతో ఆకట్టుకుంటోంది.


ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే, మరోవైపు నటిగా లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తోంది. గత ఏడాది హనుమాన్, రాయన్, మ్యాక్స్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది అమ్మడు. 2025లో స్టార్టింగ్ లో ఎప్పుడో కెరీర్ ప్రారంభంలో నటించిన మద గజ రాజా మూవీతో హిట్ సొంతమైంది.

ప్రస్తుతం విజయ్ దళపతి జన నాయగన్ మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న వరలక్ష్మి.. శివంగిలో కూడా నటిస్తోంది. మరిన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో కూడా ఆమె భాగమైంది. సినిమాలతో పాటు పలు టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు హాలీవుడ్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మరి హాలీవుడ్ డెబ్యూతో ఎలాంటి హిట్ వరలక్ష్మికి దక్కుతుందో వేచి చూడాలి.

Tags:    
  • VaralaxmiSarathkumar 
  • RIZANA 
  • HollywoodDebut 
  • JeremyIrons 
  • TamilActress 
  • IndianActressInHollywood 
  • KollywoodToHollywood 
  • CagedBird 
  • SriLankaShoot 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS