• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బేబీ సైలెన్స్ కి కారణం...

బేబీ సైలెన్స్ కి కారణం అదేనా...?

| వైష్ణవి దిల్‌ రాజు బ్యానర్‌ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలకు సైన్‌ చేసిందట. అందులో ఒక సినిమా ఆశిష్‌ రెడ్డి హీరోగా నటిస్తున్న 'లవ్‌ మీ'.

By - Tupaki Desk
Update: 2023-12-30 06:08 GMT

2023 సంవత్సరంలో సంచలనం సృష్టించిన సినిమాల్లో బేబీ ఒకటి అనడంలో సందేహం లేదు. చిన్న సినిమాగా విడుదల అయ్యి దాదాపుగా వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన బేబీ సినిమాలో హీరోయిన్‌ గా నటించిన వైష్ణవి చైతన్య స్టార్‌ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. దాంతో ఈ అమ్మడు మోస్ట్‌ బిజీ హీరోయిన్‌ అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు.

బేబీతో దక్కిన ఇమేజ్ కారణంగా ఇప్పటికే నాలుగు అయిదు సినిమాలు కమిట్ అవ్వాలి.. అందులో ఒకటి రెండు అయినా విడుదల అవ్వాలి. కానీ వైష్ణవి ఇప్పటి వరకు బేబీ తర్వాత ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేదు. స్లో అండ్‌ స్టడీ అన్నట్లుగా బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య సినిమాలను ఎంపిక చేసుకుంటోంది.

వైష్ణవి దిల్‌ రాజు బ్యానర్‌ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలకు సైన్‌ చేసిందట. అందులో ఒక సినిమా ఆశిష్‌ రెడ్డి హీరోగా నటిస్తున్న 'లవ్‌ మీ'. ఇప్పటికే ఆ సినిమా పనులు మొదలు అయ్యాయి. మరో రెండు సినిమాలు వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దిల్‌ రాజు బ్యానర్‌ కి వరుసగా మూడు సినిమాలకు సైన్‌ చేసింది కనుక ఇతర బ్యానర్స్‌ నుంచి ఆఫర్స్‌ వస్తున్నా కూడా హోల్డ్ లో పెడుతోంది. ఆశీష్ తో చేస్తున్న లవ్‌ మీ సినిమా తర్వాత వైష్ణవి కొత్త సినిమాకు ఓకే చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లవ్‌ మీ హిట్ అయితే మంచి పారితోషికం డిమాండ్‌ చేయవచ్చు అని వైష్ణవి భావిస్తూ ఉండవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బేబీ బ్యూటీ వైష్ణవి మూవీస్ కోసం ఆమె ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తూ ఉంటే.. ఆమె మాత్రం చాలా ఆలోచించి ఎంపికలు చేస్తోంది.

Tags:    
  • Tollywood 
  • Baby 
  • Babymovie 
  • Vaishnavichaitnya 
  • Actress 
  • Dilraju 
  • Production 
  • Ashishreddy 
  • Movieoffers 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS