వైష్ణవి నమ్మింది.. ఇప్పుడు ఆదిత్య నిలబెట్టుకోవాలి!

ఎపిక్‌లో కొన్ని సీన్స్ విషయంలో మొదట తనకు సందేహం వచ్చిందని వైష్ణవి చైతన్య చెప్పింది.

Update: 2026-09-09 08:27 GMT

ఎపిక్‌లో కొన్ని సీన్స్ విషయంలో మొదట తనకు సందేహం వచ్చిందని వైష్ణవి చైతన్య చెప్పింది. అప్పుడు దర్శకుడు ఆదిత్య హాసన్ ఆ సీన్స్ ఎందుకు అవసరమో వివరించాడట. తనను నమ్మమని చెప్పడంతో ముందుకు వెళ్లానని కూడా తెలిపింది. హీరోయిన్ ఇలా ఓపెన్‌గా దర్శకుడిపై నమ్మకం పెట్టుకున్నానని చెప్పడం ఆదిత్యకు ఒకరకంగా పెద్ద బాధ్యతనే ఇచ్చింది.

దర్శకుడు కథ చెప్పేటప్పుడు నటుడిని ఒప్పించడం ఒక టాస్క్. అయితే షూటింగ్ పూర్తయ్యాక అదే సీన్ చూసినప్పుడు నటుడికి తాను తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపించాలి. ముఖ్యంగా ముందుగా సందేహించిన సీన్స్ విషయంలో ఇది ఇంకా ముఖ్యం. వైష్ణవి మాటలు చూస్తే ఆదిత్య ఆమెకు క్యారెక్టర్ మొత్తం వివరించిన తర్వాతే ముందుకు వెళ్లినట్టు తెలుస్తోంది.

ఆదిత్యకు ఎపిక్‌తో మరో కొత్త ఛాలెంజ్ కూడా ఎదురవుతోంది. 90స్‌లో ఎక్కువగా కొత్తవాళ్లు, తెలిసిన కుటుంబ వాతావరణంతో కథ చెప్పాడు. ఇప్పుడు మాత్రం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లాంటి తెలిసిన నటులతో సినిమా చేస్తున్నాడు. వాళ్లకు గత సినిమా బేబీ నుంచి వచ్చిన ఇమేజ్ ఉంటుంది. కొత్త పాత్రల్లో వాళ్లను నమ్మించడం దర్శకుడికి మొదటి టాస్క్.

పైగా ఎపిక్ ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి క్యారెక్టర్ల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. కథ మొత్తం బయటపెట్టకుండా, ఇద్దరి స్వభావాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ముందుకు తెచ్చారు. దీంతో నటీనటుల పెర్ఫార్మెన్స్ మీదే ఎక్కువ ఫోకస్ పడుతుంది. అలాంటి సినిమాలో దర్శకుడు రాసిన సీన్ కంటే, నటుడి నుంచి దాన్ని ఎంత సహజంగా తీసుకున్నాడనేది హైలెట్ అవుతుంది.

వైష్ణవి చెప్పిన మాటల్లో మరో విషయం ఉంది. తనకు సందేహం ఉన్న చోట దర్శకుడితో మాట్లాడే స్పేస్ ఆమెకు దొరికింది. ఆదిత్య కూడా డైరెక్ట్ గా చేయాల్సిందే అని కాకుండా, తన ఆలోచన ఏంటో వివరించాడు. యంగ్ డైరెక్టర్‌కు సెట్లో ఇలాంటి కమ్యూనికేషన్ చాలా అవసరం. ముఖ్యంగా ప్రేమకథలో హీరో, హీరోయిన్ ఇద్దరూ దర్శకుడిని నమ్మితేనే కొన్ని సీన్స్ సహజంగా వస్తాయి.

ఇప్పుడు ఎపిక్ రిలీజ్ తర్వాత వైష్ణవి చెప్పిన ఆ నమ్మకం గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆమెకు డౌట్ ఉన్న సీన్స్ తెరపై ఎలా వచ్చాయి, ఆదిత్య చెప్పిన కారణం సినిమాలో ఎంత వరకు కనిపించింది అన్నది అప్పుడే తెలుస్తుంది. దర్శకుడిగా 90స్‌తో పేరు తెచ్చుకున్న ఆదిత్యకు, ఎపిక్‌లో నటీనటుల నుంచి తీసుకున్న పెర్ఫార్మెన్స్ కూడా ఈసారి పెద్ద చాలెంజ్. మరి ఆ నటీనటులు ఎంతవరకు ఎట్రాక్ట్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News