భాగ్యశ్రీ వా.. వారెవా..!
ముఖ్యంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హీరో, హీరోయిన్ మధ్య వచ్చే ఈ సాంగ్ ట్యూన్, లిరిక్స్ అన్నీ యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.;
ఆంధ్రా కింగ్ తాలూకా తర్వాత భాగ్య శ్రీ బోర్స్ చేస్తున్న సినిమా లెనిన్. అక్కినేని హీరో అఖిల్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను మురళి కిషోర్ డైరెక్ట్ చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి తొలి సాంగ్ వా వారెవా రిలీజైంది. సాంగ్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా ఇన్ స్టంట్ హింట్ అయ్యింది. ఈమధ్య వరుస సినిమాలతో థమన్ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అఖిల్ లెనిన్ కోసం ఇచ్చిన వారెవా సాంగ్ కూడా అదరగొట్టేశాడు.
యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న భాగ్యశ్రీ..
ముఖ్యంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హీరో, హీరోయిన్ మధ్య వచ్చే ఈ సాంగ్ ట్యూన్, లిరిక్స్ అన్నీ యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు హాఫ్ శారీలో భాగ్య శ్రీ కూడా చూడ ముచ్చటగా ఉంది. చూస్తుంటే లెనిన్ కూడా భాగ్య శ్రీకి కలిసి వచ్చేలా ఉంది. కాంతా, ఆంధ్రా కింగ్ తాలూకా రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవగా ఆ రెండు సినిమాల్లో భాగ్య శ్రీ వరకు ఇంప్రెస్ చేసింది.
ఐతే భాగ్య శ్రీకి ఒక్క హిట్టు పడకపోతేనే ఈ రేంజ్ ఫాం కొనసాగిస్తుంది. అదే ఒక సూపర్ హిట్ పడితే ఇంకెలా దూసుకెళ్తుందో అని చర్చిస్తున్నారు. ఏది ఏమైనా అమ్మడి సినిమాల సెలక్షన్ మాత్రం ఇంప్రెస్ చేస్తుంది. అఖిల్ తన ఏజెంట్ సినిమా తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని లెనిన్ తో వస్తున్నాడు. ఈ సినిమాను ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
భాగ్య శ్రీ ఖాతాలో హిట్టు పడితే..
లెనిన్ టీజర్ ఇంప్రెస్ చేయగా ఇక లేటెస్ట్ గా వచ్చిన వా వారెవా సాంగ్ కూడా ఆకట్టుకుంది. సో అమ్మడికి లెనిన్ కలిసి వచ్చేలా ఉందని అనిపిస్తుంది. భాగ్య శ్రీ ఖాతాలో ఒక్క హిట్టు పడితే ఆమెకు మరిన్ని అవకాశాలు క్యూ కడతాయని చెప్పొచ్చు. మిస్టర్ బచ్చన్ నుంచి ఆంధ్రా కింగ్ తాలూకా వరకు తీసిన 3, 4 సినిమాలతోనే భాగ్య శ్రీ తెలుగులో యూత్ ఆడియన్స్ నుంచి సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. తప్పకుండా అమ్మడికి టాలీవుడ్ లో మంచి ఫ్యూచర్ ఉండేలా ఉంది.
సౌత్ సినిమాలే తన టార్గెట్ గా పెట్టుకున్న భాగ్య శ్రీ కాంతా సినిమాతో తమిళ ఆడియన్స్ మనసులు గెలిచింది. సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు కానీ ఆమె నటన ఆకట్టుకుంది. ఇక తెలుగులో నెక్స్ట్ భాగ్య శ్రీ తో స్వప్న సినిమాస్ ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేస్తుందని టాక్. లెనిన్ తో సక్సెస్ పడి ఆ లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా వర్క్ అవుట్ అయితే మాత్రం భాగ్య శ్రీ హవా ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.