• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అక్కడ ‘ఉస్తాద్’కు...

అక్కడ ‘ఉస్తాద్’కు ‘దురంధర్’ దెబ్బ గట్టిగానే..

| తెలుగు సినిమాలకు తెలుగు రాష్ట్రాల తర్వాత అతి పెద్ద మార్కెట్ ఉన్నది యుఎస్‌లోనే. గత రెండు దశాబ్దాల్లో అక్కడ మార్కెట్ అసాధారణంగా వృద్ధి చెందింది.

By - Garuda Media
Update: 2026-03-20 11:30 GMT

తెలుగు సినిమాలకు తెలుగు రాష్ట్రాల తర్వాత అతి పెద్ద మార్కెట్ ఉన్నది యుఎస్‌లోనే. గత రెండు దశాబ్దాల్లో అక్కడ మార్కెట్ అసాధారణంగా వృద్ధి చెందింది. నైజాంతో సమానంగా అక్కడ మార్కెట్ తయారవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అక్కడ పెద్ద స్టార్ల సినిమాలకు మిలియన్ డాలర్ల వసూళ్లు అన్నవి చాలా కామన్ అయిపోయాయి. చాలా సినిమాలకు అందుకోసం వీకెండ్ అంతా అయ్యే వరకు కూడా ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. భారీ హైప్ ఉంటే ప్రిమియర్స్‌తోనే మిలియన్ క్లబ్బులోకి వెళ్లిపోతుంటాయి సినిమాలు. కొన్ని చిత్రాలు ప్రిమియర్స్, డే-1తో కలిపి ఈ ఘనత సాధిస్తుంటాయి. యుఎస్‌లో మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ చివరి చిత్రం ‘ఓజీ’ యుఎస్‌లో ఏకంగా 5.5 మిలియన్ డాలర్ల దాకా కొల్లగొట్టడం విశేషం. కానీ దాని తర్వాత పవన్ నుంచి వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాత్రం అమెరికాలో ఆశించిన ప్రదర్శన చేయలేకపోతోంది.

ఉస్తాద్ ప్రీమియర్ సేల్స్ ఒక మోస్తరుగా జరిగాయి. ఫైనల్ కలెక్షన్స్ 3.2 లక్షల డాలర్ల దాకా వచ్చాయి. పవన్ రేంజికి ఇది తక్కువ నంబరే. డే-1 కలెక్షన్లు కూడా కలిపినా యుఎస్ వసూళ్లు హాఫ్ మిలియన్ మార్కును దాటకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. గురువారం ఈ చిత్రానికి లక్ష డాలర్ల లోపే కలెక్షన్ వచ్చింది. శుక్రవారానికి కానీ హాఫ్ మిలియన్ సాధ్యం కాలేదు. వీకెండ్లో కూడా భారీ వసూళ్లు వచ్చే సంకేతాలు కనిపించడం లేదు. దురంధర్ దెబ్బ పవన్ మూవీకి గట్టిగానే తగిలిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అదే సమయంలో ఉస్తాద్ బ్యాడ్ రివ్యూలు తెచ్చుకుంది. ఇలాంటి రొటీన్ మూవీస్ చూడడానికి యుఎస్ ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. పైగా బ్యాడ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు 20-25 డాలర్ల రేటు ఉంటే.. బ్లాక్ బస్టర్ టాక్ తో నడుస్తున్న మూవీకి 12 - 17 డాలర్లు పెడితే చాలు. విజువల్ గా కూడా గొప్ప అనుభూతిని ఇచ్చే సినిమా కావడం దురంధర్-2కు బాగా ప్లస్ అవుతోంది. ఆ మూవీ ప్రీమియర్స్ తోనే 2 మిలియన్ డాలర్లు కొల్లగొట్టడం విశేషం. డే -1 వసూళ్ళు కూడా కలిపితే లెక్క 5.5 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫుల్ రన్లో ఈ మూవీ 15 మిలియన్స్ కు తక్కువ వసూలు చేసేలా లేదు.

Tags:    
  • usboxoffice 
  • dhurandhar2 
  • usthadbhagatsingh 
  • pawankalyan 
  • ranveersingh 
  • telugumovies 
  • uspremieres 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS