ఫోటో స్టోరి: ఫెదర్ క్వీన్ ఊర్వశి రౌతేలా
బాలీవుడ్, టాలీవుడ్‌లో పరిచయం అవసరం లేని పేరు ఊర్వశి రౌతేలా. ఈ పంజాబీ బ్యూటీ ఓవైపు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తూనే, స్పెషల్ నంబర్లలోను నర్తిస్తోంది. ఇ;
బాలీవుడ్, టాలీవుడ్‌లో పరిచయం అవసరం లేని పేరు ఊర్వశి రౌతేలా. ఈ పంజాబీ బ్యూటీ ఓవైపు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తూనే, స్పెషల్ నంబర్లలోను నర్తిస్తోంది. ఇటీవల ఎన్బీకే సరసన `దబిడి దిబిడి` పాటతో మరోసారి దేశవ్యాప్తంగా యూత్ ని ఆకర్షించింది. ప్రముఖ క్రికెటర్ పంథ్‌తో డేటింగ్ గొడవలతోను ఊర్వశి పేరు మార్మోగింది. క్రికెటర్ తో వివాదం తనను బాగా ఫేమస్ అయ్యేలా చేసంది. ఇక తానేం చేసినా తనను తాను సమర్థించుకుంటూ తెలివిగా ముందుకు సాగిపోతోంది ఈ పంజాబీ బ్యూటీ.
ఇటీవలే కేన్స్ - 2025 ఉత్సవాల్లోను ప్రత్యక్షమైన ఊర్వశి.. తనను ఫలానా హాలీవుడ్ స్టార్స్ మెచ్చుకున్నారని, క్వీన్ ఆఫ్ కేన్స్ అని పిలిచారని కామెంట్ చేసి దొరికిపోయింది. ఇక ఊర్వశిపై కామెంట్లు చేసేందుకు ఒక సెక్షన్ నెటిజనులు ఎప్పడూ సిద్ధంగా ఉన్నారు. అందువల్ల నిరంతరం ఊర్వశి ట్రోలింగ్ కి గురవుతోంది.
తాజాగా ఈ భామ స్టన్నింగ్ ఫోజ్ ఒకటి ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. వైట్ అండ్ వైట్ లుక్ లో ఊర్వశి నిజంగా స్టన్నర్ గా కనిపిస్తోంది. ఇది ఊలు, అందమైన ఫెదర్స్ తో ఎంతో భారీతనంతో డిజైన్ చేసిన లెహంగా. దీనికోసం పక్షుల ఫెదర్స్ ని ఉపయోగించుకున్న తీరు ఆకట్టుకుంది. ఊర్వశి ఈ కొత్త డిజైనర్ లుక్ లో చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఈ ఫోటోషూట్ ని షేర్ చేయడమే గాక దీనికి అందమైన క్యాప్షన్ ని ఇచ్చింది. మన ఆత్మలు దేనితో తయారు చేసినా.. అతడి హృదయం & నా హృదయం ఒకటే! అని లవ్ సింబల్ ని షేర్ చేసింది. మొత్తానికి ఊర్వశి నిరంతరం తన ఉనికిని చాటుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు వైట్ అండ్ వైట్ ఫెదర్ లెహంగాలో ఎంతో ముగ్ధ మనోహరంగా కనిపిస్తోంది.