స్టార్ హీరోలంతా ఉప్మా స్పెషలిస్టులే!
తెలుగు సినిమాల్లో ఉప్మా సన్నివేశాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఉప్మా మీద హీరో-హీరోయిన్ కాంబినేషన్ లో సీన్లే తీసేవారు అప్పట్లో;
తెలుగు సినిమాల్లో ఉప్మా సన్నివేశాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఉప్మా మీద హీరో-హీరోయిన్ కాంబినేషన్ లో సీన్లే తీసేవారు అప్పట్లో. చిరంజీవి..బాలయ్య...వెంకటేష్..నాగార్జున లాంటి సీనియర్ హీరోల నుంచి తర్వాత తరం హీరోల వరకూ చాలా మంది స్టార్లు ఉప్మా సన్నివేశాల్లో నటించిన వారే. `ఘరానా మొగుడు` సినిమాలో చిరంజీవి-వాణీ విశ్వనాధ్ మధ్య ఉప్మా సన్నివేశం అప్పట్లో హైలైట్. `ఏముంది మీ డబ్బాలో అని` చిరంజీవి అంటే ఉప్మా అంటూ హీరోయిన్ బధులిస్తుంది. `తినండి తినండి మీరే తినండి ఎవరికి పెట్టొద్దంటూ` చిరు రిప్లై ఎంతో కొంటెంగా ఉంటుంది.
అటుపై `స్నేహంకోసం` సినిమాలో చిరంజీవి కుమారుడి పాత్ర కోసం ఉప్మా చేసే సన్నివేశం అంతే చక్కగా పండుతుంది. అలాగే `మన్మధుడు` సినిమాలో నాగార్జునను `ఆఫీస్ కు ఎందుకు రాలేదని` సోనాలి బింద్రే అడిగితే `ఇవాళ ఉప్మా తినాలనిపించింది. అందుకే రాలేదదంటాడు`. `ఉప్మా తినాలంటే ఆఫీస్ కు రావడం మానేయాలా? అని హీరోయిన్ అడిగితే పొద్దుట నుంచి ప్రయత్నిస్తే ఇప్పటికి ఉప్మా రెడీ అయిందంటూ నాగ్ బధులిస్తారు. అలాగే `పోకిరి` సినిమాలో మహేష్- మాస్టర్ భరత్, ఇలియానా మధ్య కూడా ఉప్మా సన్నివేశం బాగా పండింది.
``డబ్బాలో ఏంటి? అంటే `ఉప్మా` అంటే.. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బ్రతికేస్తున్నారని సెటైర్ వేస్తాడు మహేష్. అలాగే `రేసు గుర్రం` సినిమాలో అల్లు అర్జున్ కూడా ఓ సీన్ లో నటిస్తాడు. `మా బాబుకు జీడిపప్పు ఉప్మా అంటే ఇష్టం. తనకేమో జీడిపప్పు అంటే ఇష్టమని ఉప్మా మీద ఉన్న జీడిపప్పు పప్పు అంతా లాంగిచేస్తాడు బన్నీ. ఇంకా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన `నిన్ను కోరి` సినిమాలోనూ జీడిపప్పు ఉప్మా సీన్ ఉంటుంది. నాని- నివేధా థామస్ ప్రేమలో పడిన సందర్భంలో ప్రియుడికి ఉప్మా పంపిచే సీన్ ఉంటుంది.
అందులో జీడిపప్పు ఉప్మా...టేస్ట్ చేసి టెక్స్ట్ చేయ్ అంటూ హీరోయిన్ అంటుంది. దానికి బధులుగా నాని అమాయకంగా తల ఊపుతాడు. ఇలాంటి ఉప్మా సన్నివేశాల్లో నటించిన స్టార్లు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడా ఉప్మా సన్నివేశాలు నేటి సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. సినిమా జానర్ మారే సరికి ఫ్యామిలీ సన్ని వేశాలు కనుమరుగైపోయాయి. దీంతో ఉప్మా సన్నివేశాలకు తావు లేకుండా పోయింది. మరి మర్చిపోతున్న ఉప్మా సన్నివేశాలని మళ్లీ ఎవరైనా గుర్తు చేస్తారేమో చూడాలి.