ఆంధ్ర కింగ్ తాలూకా.. రామ్ ఎనర్జీకి ఉపేంద్ర ఫిదా
బిగ్ స్క్రీన్ పై ఒక మంచి ఫీల్ గుడ్ స్టోరీ చూసి చాలా కాలమైందనే సినీ లవర్స్ కు ఇప్పుడు రామ్ పోతినేని ఒక మంచి సినిమాను చూపించడానికి సిద్ధమవుతున్నాడు.;
బిగ్ స్క్రీన్ పై ఒక మంచి ఫీల్ గుడ్ స్టోరీ చూసి చాలా కాలమైందనే సినీ లవర్స్ కు ఇప్పుడు రామ్ పోతినేని ఒక మంచి సినిమాను చూపించడానికి సిద్ధమవుతున్నాడు. అదే 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఈ సినిమా ట్రైలర్ తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం రామ్ పోతినేని టీమ్ ఇప్పుడు బెంగళూరులో ల్యాండ్ అయ్యింది.
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తుండటంతో, అక్కడ జరిగిన మీడియా సమావేశం ఆసక్తికరంగా సాగింది. ఈ వేదికపై ఉపేంద్ర మాట్లాడుతూ రామ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. "రామ్ నిజంగానే ఎనర్జిటిక్ స్టార్. అతని డ్యాన్స్, పర్ఫార్మెన్స్ చూస్తే ముచ్చటేస్తుంది" అంటూ కితాబిచ్చారు. ఈ సినిమా ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెబుతూనే, ఇందులో బలమైన హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. 2000 సంవత్సరం నాటి ఇండస్ట్రీ గోల్డెన్ డేస్ ని ఈ సినిమా గుర్తుచేస్తుందని, దర్శకుడు మహేష్ బాబు ప్రతి షాట్ ని పర్ఫెక్ట్ గా చెక్కారని ఉపేంద్ర చెప్పుకొచ్చారు.
మరోవైపు రామ్ పోతినేని మాటల్లో ఉపేంద్ర పట్ల మంచి గౌరవం కనిపించింది. "ఉపేంద్ర గారిని నేను కేవలం నటుడిగా మాత్రమే కాదు, ఒక దర్శకుడిగా, అంతకుమించి ఒక వ్యక్తిగా గౌరవిస్తాను. ఆయన సినిమాలు, ఆయన ఫిలాసఫీ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి లెజెండ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు దక్కిన గౌరవం" అంటూ రామ్ ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాలోని ఆ పాత్రకు ఉపేంద్ర తప్ప మరొకరు న్యాయం చేయలేరని రామ్ తేల్చిచెప్పారు.
సినిమా గురించి రామ్ ఇచ్చిన వివరణ చాలా కొత్తగా ఉంది. "ఇది కేవలం ఒక స్టార్ కి, ఫ్యాన్ కి మధ్య జరిగే కథ కాదు. ఇదొక గుండె లోతుల్లోంచి వచ్చిన కథ. మేం అందరం ఈ సినిమాను హార్ట్ తో ప్రేమించి చేశాం. మా హార్ట్స్ తో మీ హార్ట్స్ ని టచ్ చేయడమే మా లక్ష్యం" అంటూ రామ్ సినిమాలోని ఎమోషనల్ డెప్త్ ని ఆవిష్కరించారు. కమర్షియల్ హంగులు ఉన్నా, సోల్ మాత్రం ఎమోషనే అని హింట్ ఇచ్చారు.
ఇక దర్శకుడు మహేష్ బాబు పి టేకింగ్, 2000 నాటి బ్యాక్ డ్రాప్ ఈ సినిమాకు మేజర్ అసెట్ కానున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అనూహ్యమైన స్పందన లభించడంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఉపేంద్ర, రామ్ కలిసి చేసిన ఈ ప్రమోషన్స్ తో కన్నడ మార్కెట్ లోనూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
ఇక బెంగళూరు ఈవెంట్ 'ఆంధ్ర కింగ్' టీమ్ లోని కాన్ఫిడెన్స్ ని బయటపెట్టింది. రియల్ స్టార్, ఎనర్జిటిక్ స్టార్ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ మీద ఎలా ఉండబోతోందో చూడాలనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. నవంబర్ 28న ఈ ఎమోషనల్ జర్నీ ఆడియన్స్ ని ఎంతవరకు కట్టిపడేస్తుందో వేచి చూడాలి.