ఉపాసన డ్రెస్ రేటు హాట్ టాపిక్‌..!

సమయంలో ఉపాసన ధరించిన పింక్ కలర్ డ్రెస్‌ గురించి మీడియాలో ప్రస్తుతం తెగ చర్చ జరుగుతోంది.

Update: 2023-09-11 10:51 GMT

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ భార్యగానే కాకుండా ఉపాసన తనకంటూ సొంత గుర్తింపు కలిగి ఉన్నారు. ఆమె చేసే పనులు, అందుకునే గుర్తింపు కారణంగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఉపాసన గురించి మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఈసారి ఆమె ధరించిన డ్రెస్‌ వల్ల వార్తల్లో నిలిచింది.

రామ్ చరణ్ తో కలిసి ఉపాసన తాజాగా విదేశాలకు వెళ్లారు. ఆ సమయంలో ఉపాసన ధరించిన పింక్ కలర్ డ్రెస్‌ గురించి మీడియాలో ప్రస్తుతం తెగ చర్చ జరుగుతోంది. ఎయిర్ పోర్ట్‌ లో రామ్‌ చరణ్, ఉపాసన సందడి చేశారు. మీడియా వారు మెగా దంపతులను తమ కెమెరాల్లో బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు.

ఎయిర్‌ పోర్ట్‌ లో కనిపించిన ఉపాసన ధరించిన డ్రెస్ ఖరీదు దాదాపుగా రూ.50 వేలు అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ పింక్ కలర్ జాకెట్‌ అత్యంత అరుదైన ఫ్యాబ్రిక్ తో తయారు చేసినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆన్‌ లైన్ లో ఈ డ్రెస్ గురించి జనాలు తెగ వెతికేస్తున్నారు.

రామ్‌ చరణ్ వంటి సూపర్‌ స్టార్‌ భార్య, కామినేని వంటి అత్యున్నత స్థాయి వ్యాపారాలు కలిగి ఉన్న ఉపాసన రూ.50 వేల డ్రెస్ వేసుకోవడం పెద్ద మ్యాటర్ కానే కాదు. ఆమె తల్చుకుంటే రోజుకు లక్షలు ఖర్చు చేసి డ్రెస్ లు ధరించగలదు. కానీ ఆమెకు చాలా సింపుల్ గా ఉండటం ఇష్టం అనేది ఆమె సన్నిహితుల మాట.

Tags:    

Similar News