విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఉపాసన రియాక్షన్.. కారణమేంటి?

ఉపాసన కొణిదెల.. ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్‌ లో ఉంటారు ఈ మెగా కోడలు.

Update: 2024-02-09 04:08 GMT

ఉపాసన కొణిదెల.. ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్‌ లో ఉంటారు ఈ మెగా కోడలు. తన కుటుంబంలో జరిగిన శుభకార్యాలకు సంబంధించిన పలు ఫొటోలతోపాటు వీడియోలను ఆమె షేర్‌ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు రామ్‌ చరణ్‌ తో పాటు గేమ్‌ ఛేంజర్‌ సినిమా సెట్స్‌ నుంచి కూడా పలు ఫొటోలు పంచుకుంటారు. ఇటీవలే ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తమిళ స్టార్ హీరో విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఇటీవలే ఉపాసన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. విజయ్‌ ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారంటే అది చాలా గొప్ప విషయమని ఉప్సీ కొనియాడారు. ఒకవేళ అలాంటి వాళ్లకు సపోర్ట్‌ చేయకపోయినా.. వెనక్కి మాత్రం లాగకూడదని అన్నారు.

ఇక ఇప్పటివరకు రాజకీయాలపై ఎక్కడా ఎప్పుడూ ఉపాసన మాట్లాడలేదు. తన మామయ్యలు పవన్ కల్యాణ్, నాగబాబు ప్రస్తుతం ఏపీ క్రియాశీల రాజకీయాల్లోనే ఉన్నా.. ఎప్పుడూ నోరు విప్పలేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైమ్ విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఆమె వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సడెన్ గా ఉపాసనకు పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందని అంతా చర్చించుకుంటున్నారు.

అయితే తన మామయ్య ప్రజలకు సేవ చేశారని, ఇప్పుడు తన చిన్న మామయ్య చేస్తున్నారని చెప్పారు. తాను మాత్రం రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు ఉపాసన. మార్పు తీసుకువచ్చే నాయకుడికి మద్దతు ఇస్తానని చెప్పారు. ఇక చెన్నైలో ఉపాసన, రామ్ చరణ్ కు బిజినెస్ లు ఉన్నాయని, అందుకే ఆమె ఈ కోణంలో మాట్లాడారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మెగా ఫ్యామిలీలో పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ.. బిజీబిజీగా గడుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి గతంలో పీఆర్పీ పేరుతో పార్టీని స్థాపించారు. కొన్ని కారణాలతో పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరో మెగా బ్రదర్ నాగబాబు కూడా జనసేన పార్టీలోనే ఉన్నారు. మరి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఏ మాత్రం సక్సెస్‌ ఫుల్ అయ్యిందో 2026 తమిళనాడు ఎన్నికల్లో అర్థమవుతుంది.

Tags:    

Similar News