వారసత్వం, పెళ్లిపై ఉపాసన పోస్ట్.. కష్టంతోనే సాధ్యం అంటూ!
మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక విషయం ద్వారా ట్రెండింగ్ లో ఉంటుంది.;
మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక విషయం ద్వారా ట్రెండింగ్ లో ఉంటుంది.అలా తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ ఎంతో మందిని ఆలోచింపజేస్తుంది. మరి ఉపాసన పెట్టిన 'ఖాస్ ఆద్మీ పార్టీ' అనే పోస్టులో ఉన్న అంతరార్థం ఏంటి..? దాని వెనక ఉపాసన పడ్డ కష్టం ఏంటి.. ?ఆమె సక్సెస్ కి కారణం ఏంటి.. ?అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
ఖాస్ గా నిలబడాలంటే ఆ కష్టం తప్పదు - ఉపాసన
మెగా కోడలు ఉపాసన మెగా ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్లాకే అందరికీ తెలిసిందని అందరూ అనుకుంటారు. అంతేకాదు ఆమె ఇంత సక్సెస్ అవ్వడానికి అందరిలో ప్రత్యేకంగా నిలవడానికి కారణం కూడా రామ్ చరణ్ తో పెళ్లే అనుకుంటారు. కానీ తన సక్సెస్ కి ఇవేవీ కారణం కాదంటుంది ఉపాసన. తన సక్సెస్ కి అదొక్కటే కారణం అంటుంది. అదేంటంటే.. "సమాజంలో ఒక వ్యక్తి స్వభావిక లక్షణాల కంటే ఎక్కువగా బాహ్య లక్షణాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సమాజంలో నిజమైన ఖాస్ గా నిలబడాలి అంటే ఆ వ్యక్తి కీర్తి,సంపద,హోదా,ఒకరి పట్ల చూపించే దయ అనేది వాళ్లను సమాజంలో నిజమైన ఖాస్ గా నిలబెడుతుందని నా అభిప్రాయం..అయితే నేను కూడా సమాజంలో ఒక ప్రత్యేకమైన ఖాస్ గా నిలబడ్డాను. దీనికి కారణం నా వారసత్వం కాదు.. నేను గొప్పింటికి కోడలుగా వెళ్లడం కాదు.. ఇవి రెండూ కూడా సమాజంలో నన్ను ప్రత్యేకంగా నిలబట్టలేదు. కేవలం నా కృషి,పట్టుదల, ఒత్తిడి, బాధ.. ఇవన్నీ భరించాకే నేను సమాజంలో ప్రత్యేకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాను.
ఈ సక్సెస్ వెనుక అవేవీ కారణం కాదు - ఉపాసన..
జీవితంలో ముందుకు రావడానికి ఎంతో శ్రమించాను. ఎన్నో ఒత్తిళ్ళను తట్టుకున్నాను. ఎంతో బాధను కూడా అనుభవించాను. ఎంత ఒత్తిడి ఎదురైనా సరే జీవితంలో సక్సెస్ అవ్వాలని అనుకున్నాను. అందుకే ఈరోజు మీ ముందు ఖాస్ గా నిలబడ్డాను. అయితే ఈ ప్రత్యేకమైన స్థానం కోసం నేను నా జీవితంలో చాలా సార్లు కింద పడ్డాను. కానీ కింద పడ్డ ప్రతిసారి పైకి లేచి నాకు నేనే సర్ది చెప్పుకొని నా లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నిరంతరం శ్రమించాను. చాలాసార్లు నన్ను నేనే అవమానించుకున్నాను. నేను మీ అందరితో నిజాయితీగా ఉండాలి అనే ఉద్దేశంతోనే నా జీవితంలో ఎదుర్కొన్న వాటిని మీతో పంచుకుంటున్నాను. అయితే ఇలాంటి పోస్ట్ వల్ల నా జీవితంలో నేను ఎన్ని కష్టాలు అనుభవించానో.. నా ఫ్యామిలీ పట్ల,విలువల పట్ల ఎంత కృతజ్ఞతగా ఉన్నానో మీకు తెలియడం కోసమే ఇది చెప్పుకొస్తున్నాను.అలాగే కింద పడ్డా సరే పైకి లేద్దాం.. ఎప్పటికీ ఎదుగుతూనే ఉందాం".. అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఉపాసన పెట్టిన ఈ పోస్ట్ కి చాలామంది నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
ఉపాసన పర్సనల్ లైఫ్..
ఉపాసన పర్సనల్ లైఫ్ కి వస్తే..ఆమె మెగా స్టార్ చిరంజీవి కోడలుగా, రామ్ చరణ్ కి భార్యగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ గా భాద్యతలు తీసుకోవడమే కాకుండా రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ గా కూడా కీలక బాధ్యతలు కట్టబెట్టారు.