• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఫ్యామిలీ స్టార్' కోసం...

'ఫ్యామిలీ స్టార్' కోసం దిల్ రాజు కొడుకు!

| అందుకే ఈ శుక్రవారం విడుదల కాబోతున్న 'ఫ్యామిలీ స్టార్' చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అగ్ర నిర్మాత.

By - Tupaki Desk
Update: 2024-04-04 12:33 GMT

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇప్పటి వరకూ 50 సినిమాలను నిర్మించారు. ఓవైపు భారీ చిత్రాలను రూపొందిస్తూనే, మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూ మంచి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే SVC సంస్థ నుంచి పర్ఫెక్ట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలాకాలం అయింది. అందుకే ఈ శుక్రవారం విడుదల కాబోతున్న 'ఫ్యామిలీ స్టార్' చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అగ్ర నిర్మాత. దగ్గరుండి సినిమా ప్రమోషన్స్ అన్నీ చూసుకుంటున్నారు. తన ఫ్యామిలీ మొతాన్ని ప్రచార కార్యక్రమాల్లో భాగం చేస్తున్నారు.

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ మూవీ, ఏప్రిల్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారు.. వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు. టీవీ షోలలో గెస్టులుగా పాల్గొంటున్నారు. దాదాపు అన్ని ప్రోగ్రామ్స్ కు హీరో హీరోయిన్లతో పాటుగా నిర్మాత దిల్ రాజు కూడా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ షోకి తన భార్యా కుమారుడితో కలిసి వచ్చారు.

ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకుని 'స్టార్ మా' ఛానల్ నిర్వాహకులు 'మా ఇంటి పండగ' పేరుతో ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసారు. దీనికి 'ఫ్యామిలీ స్టార్' విజయ్ దేవరకొండ ముఖ్య అథితిగా వచ్చారు. అలానే దిల్ రాజు తన సతీమణి వైగా రెడ్డి, తనయుడు అన్వీ రెడ్డిలతో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ఏప్రిల్ 9న టెలికాస్ట్ కాబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇందులో విజయ్ తన డ్యాన్స్ లతో అలరించారు. పెనెం మీద దోశలు వేస్తూ ఇలాంటివి లైఫ్ లో మిస్ చేయకండి అంటూ అక్కడున్న వారందరినీ నవ్వించారు.

ఈ సందర్భంగా తన భర్త దిల్ రాజుని ప్రేమగా ఏమని పిలుస్తారని యాంకర్ శ్రీముఖి అడగ్గా.. 'జానూ' అంటూ వైగారెడ్డి సిగ్గు పడిపోయింది. ఆ తర్వాత అన్నప్రాశన టైపులో అన్వీ రెడ్డితో ఓ కార్యక్రమం చేయించారు. డబ్బులు పట్టుకుంటే తండ్రిలా నిర్మాత అవుతాడని, మెగా ఫోన్ పట్టుకుంటే డైరెక్టర్ అవుతాడని, మేకప్ కిట్ పట్టుకుంటే హీరో అవుతాడని శ్రీముఖి చెప్పింది. తనయుడు నేరుగా మేకప్ కిట్ నే పట్టుకోవడంతో దిల్ రాజు దంపతులు మురిసిపోయారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

అయితే ఇప్పటి వరకూ తన ఫ్యామిలీతో కలిసి ఎప్పుడూ టీవీ షోలకు రాని దిల్ రాజు.. ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్' ప్రమోషన్స్ కోసం భార్యతో కలిసి రావడం, తన రెండేళ్ల కొడుకుని కూడా తీసుకురావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మామూలుగా సెలబ్రిటీలు తమ పిల్లలను ఒక ఏజ్ వచ్చే వరకూ కెమెరాల ముందుకు, మీడియా ముందుకు తీసుకురారు. కానీ దిల్ రాజు మాత్రం చిన్నప్పటి నుంచే తన కుమారుడికి స్టేజ్ ఫియర్ లేకుండా, అలాంటి వాతావరణాన్ని అలవాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. 'ఫ్యామిలీ స్టార్' ప్రమోషన్స్ తో పాటుగా తన కొడుకుని కూడా ప్రమోట్ చేస్తున్నారని అనుకోవచ్చని నెటిజన్లు అంటున్నారు.

నిజానికి ఇటీవల కాలంలో ఏ సినిమాని ప్రమోట్ చేయనంతగా 'ఫ్యామిలీ స్టార్' కి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దిల్ రాజు. స్టేజీల మీద హీరో హీరోయిన్లతో కలిసి స్టెప్పులు వేస్తున్నారు. మీమర్స్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ తో దిల్ రాజు డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా ఇప్పుడు దిల్ రాజు 'ఫ్యామిలీ' ప్రమోషన్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా రిజల్ట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఈ రేంజ్ పబ్లిసిటీ చేస్తున్నారని భావిస్తున్నారు. ఇప్పటికే తన భార్య సినిమా చూసి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని రివ్యూ ఇచ్చినట్లుగా దిల్ రాజు చెబుతున్నారు. మరి అదే నిజమై SVC బ్యానర్ కు 'ఫ్యామిలీ స్టార్' మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

Get ready for a joyous celebration this Ugadi for an unforgettable experience featuring 10 families and 2 special guests. Don't miss out on this Ugadi special episode featuring Family Star @TheDeverakonda & #DilRaju garu.Join us on April 9th at 12 PM on #StarMaa #MaaIntiPandaga pic.twitter.com/5G2uRZQYX5

— Starmaa (@StarMaa) April 4, 2024
Tags:    
  • Tollywood 
  • FamilyStar 
  • VijayDevarakonda 
  • MrunalThakur 
  • Parasuram 
  • Dilraju 
  • SriVenkateswaraCreations 
  • TvShows 
  • MoviePrmotions 
  • Ugadifestival 
  • StarMaa 
  • VaigaReddy 
  • AnviReddy 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS