మ్యూజిక్ లెజెండ్ డ్రీమ్ నెరవేరిన వేళ!
మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్ రెహమాన్ ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు. తమిళం, హిందీ, తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసారు.;
మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్ రెహమాన్ ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు. తమిళం, హిందీ, తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసారు. భారతీయ సంగీతానికే వన్నె తెచ్చిన సంగీత దిగ్గజం ఆయన. రెహమాన్ సంగీతమంటే ఆ సినిమాకే ఓ బ్రాండ్. హాలీవుడ్ లో సైతం సత్తా చాటిన సంగీత సంచ లనం. అంతటి లెజండరీ ఓ మూకీ చిత్రాన్ని ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రకటించడం విశేషం. ఎలాంటి సంభాషణలు లేకుండా హావభావాలు, నేపథ్య సంగీతంతో సాగే చిత్రమే `ఉఫ్ ఏ సియాపా`. దీన్ని ఓ మూకీ చిత్రంగా చెబుతాం.
ఇదొక కామెడీ చిత్రం. తెరపై కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. ఈ సినిమా రెహమాన్ సంగీతం అందించడం కాక తన డ్రీమ్ నెరవేరిందని సంతోషం వ్యక్తం చేసారు. ఇప్పటి వరకూ రెహమాన్ ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలకు పని చేసారు. కానీ ఏ సినిమా గురించి ఇంత గొప్ప గా మాట్లాడింది లేదు. తొలిసారి ఓ మూకీ సినిమాకు అందించిన ఆనందం తనకు మరే సినిమా కలిగించలేదన్నారు. ఇలాంటి సినిమాలు సంగీతం అందించడం అన్నది ప్రతీ సంగీత దర్శకుడు ఓ కలగా భావిస్తారన్నారు.
ఎలాంటి సంభాషణలు లేకుండా కేవలం స్కోర్ తోనే సినిమా చేయడం ఎవరికైనా ఓ కొత్త అనుభూతిని పంచుతుంది. ఇలాంటి సినిమాలకు పనిచేసే అవకాశం అందరికీ రాదన్నారు. తనకు రావడం అదృ ష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అప్పట్లో విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన `పుష్పక విమానం` మూకీ చిత్రమే. ఈ సినిమా అప్పట్లో గొప్ప విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇలాంటి ప్రయత్నాలు జరగలేదు.
ఇంత కాలానికి `ఉఫ్ యే సియాపే` రాబోతుంది. మరి ఈ సినిమాకు ఎలాంటి స్పందన ఉంటుందో చూడా లి. ఈ సినిమా స్టోరీ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు మంచి బజ్ వచ్చింది. `పుష్పక విమానం` తర్వాత వస్తోన్న మూకీ చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాకు రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. దీంతో థియేట్రికల్ గానూ సినిమా మంచి విజయం సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం విడుదలవుతుంది.