ఉదయ్ పూర్ ఫైల్స్ రిలీజ్ కష్టమేనా ..?

మా సినిమాను నిలిపోయాలంటూ సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు అయ్యింది. ఐతే అది తిరస్కరణకు గురైనా కూడా ఢిల్లీ హైకోర్ట్ మాత్రం స్టే విధించింది.;

Update: 2025-07-11 16:54 GMT

వివాదాస్పద సినిమాలు ఇదివరకు రిలీజ్ అయ్యాక సినిమా షోలు ఆపేయడం జరిగేది. కానీ ఇప్పుడు టీజర్, ట్రైలర్ తోనే ఫలానా సినిమా ఈ నేపథ్యంతో తెరకెక్కింది అని తెలిసి కొందరు ఆ సినిమా ప్రదర్శనకు అడ్డు పడుతుంటారు. లీగల్ గా ఆ సినిమా రిలీజ్ ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా చాలా సినిమాలు రిలీజ్ ముందు కోర్ట్ కి వెళ్లి అక్కడ క్లియరెన్స్ తెచ్చుకుని రిలీజ్ అయ్యాయి.

ఐతే లేటెస్ట్ గా నేడు రిలీజ్ అవ్వాల్సిన ఉదయ్ పూర్ ఫైల్స్ సినిమా రిలీజ్ ఒక్కరోజు ముందు కోర్ట్ స్టే విధించడం వల్ల సినిమా రిలీజ్ ఆగిపోయింది. రిలీజ్ ప్రమోషన్స్ ఇంకా మిగతా కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత రిలీజ్ కు స్టే రావడం షాకింగ్ గా ఉంది. ఐతే ఈ సినిమా దర్శకుడు ఎస్ భరత్ ఈ మేరకు తాను సుప్రీం కోర్ట్ ను ఆశ్రయిస్తానని అన్నారు.

మా సినిమాను నిలిపోయాలంటూ సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు అయ్యింది. ఐతే అది తిరస్కరణకు గురైనా కూడా ఢిల్లీ హైకోర్ట్ మాత్రం స్టే విధించింది. అసలు ఇదెలా జరిగిందో తనకు తెలియట్లేదని అన్నారు డైరెక్టర్ ఎస్.భరత్. దీనిపై తాను సుప్రీం కోర్ట్ కు వెళ్తున్నట్టు చెప్పారు.

ఇంతకీ ఈ సినిమా రిలీజ్ కాకుండా ఎందుకు స్టే విధించారు అంటే.. ఉదయ్ పుర్ ఫైల్స్ అంటూ 2022 లో అక్కడ జరిగిన దర్జీ కన్హయ్య లాల్ హత్య నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కించారు. కన్హయ్య రోల్ ని సినిమాలో విజయ్ రాజ్ చేశారు. ఈ సినిమాలో రజనీష్ దుగ్గల్ ఇంకా మిగతా కాస్ట్ మంచి రోల్స్ చేశారు. సినిమా ట్రైలర్ టైం లోనే మూవీ నేపథ్యం తెలుసుకున్న కొందరు అభ్యంతరం తెలిపారు. మత సామరస్యం దెబ్బతినేలా ఉన్నాయని ఈ మూవీని బ్యాన్ చేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి.

ఈ క్రమంలో ఢిల్లీ హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు కాగా.. కొన్ని మార్పులతో సినిమా సెన్సార్ స్క్రూట్నీ పూర్తి చేశారు. ఐతే నేడు రిలీజ్ అవ్వాల్సి ఉన్న ఈ సినిమాకు హై కోర్ట్ స్టే విధించడం వల్ల చిత్ర యూనిట్ షాక్ అయ్యారు. సినిమా రిలీజ్ కోసం సుప్రీం కోర్ట్ కు వెళ్తామని డైరెక్టర్ భరత్ అంటున్నారు.

Tags:    

Similar News