• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇండియన్-3 మళ్లీ ఈ...

ఇండియన్-3 మళ్లీ ఈ ట్విస్ట్ ఏంటీ?

| ఆయన కెరీర్ లోనే అత్యంత పేలవమైన సినిమా ఇండియన్-2 అని అభిప్రాయపడ్డారు.

By - Tupaki Desk
Update: 2024-11-10 06:24 GMT

విలక్షణ నటుడు కమల్ హాసన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన ఇండియన్-2 మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుందో అందరికీ తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ గా హైప్ క్రియేట్ చేసుకున్న ఆ సినిమా.. దారుణంగా నిరాశపరిచింది. మేకర్స్ కు భారీ నష్టాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. డైరెక్టర్ శంకర్ మార్క్ పూర్తిగా మిస్ అయిందని అనేక రివ్యూలు వచ్చాయి. ఆయన కెరీర్ లోనే అత్యంత పేలవమైన సినిమా ఇండియన్-2 అని అభిప్రాయపడ్డారు.

అయితే ఇండియన్-2 టైమ్ లో ఇండియన్-3పై కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్-3 ట్రైలర్ ను ఇండియన్-2 చివర్లో మేకర్స్ రిలీజ్ చేయగా.. ఇంట్రెస్టింగ్ గా అందరినీ మెప్పించింది. అదే సమయంలో ఇండియన్-3 షూటింగ్ పూర్తి అయిపోయిందని హీరో కమల్ హాసన్ చెప్పి ఒక్కసారిగా షాకిచ్చారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే పెండింగ్ ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే అవి కూడా కంప్లీట్ అవుతాయని వెల్లడించారు.

కానీ ఇండియన్-2 డిజాస్టర్ గా మారడంతో ఇండియన్-3 విషయంలో ఏం జరుగుతుందోనన్న అనుమానం మాత్రం సినీ ప్రియుల్లో ఉంది. ఆ మధ్య మూడో భాగాన్ని థియేటర్లలో కాకుండా ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. దానిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ.. ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇండియన్-3 షూటింగ్ మళ్లీ జరపనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అదేంటి అప్పుడు షూటింగ్ అయిపోయింది అన్నారుగా అని నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఇండియన్-2 రిజల్ట్ తర్వాత ఇండియన్-3పై కమల్ హాసన్ స్పెషల్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా కథలో కొన్ని మార్పులు చేస్తే బెటర్ అని కమల్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. దీంతో మళ్లీ కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నారట.

కమల్ హాసన్ చేసిన ప్రతిపాదనకు డైరెక్టర్ శంకర్ తో పాటు మూవీ టీమ్ అంతా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. నెల రోజుల పాటు షూటింగ్ ను జరపనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు గాను అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. మరి ఇండియన్-3 షూటింగ్ విషయంలో వస్తున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే వేచి చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • Indian2 
  • Indian3 
  • Kamalhaasan 
  • Shankar 
  • OTT 
  • Netflix 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS