తెలుగు నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్!

భాషతో సంబంధం లేకుండా ప్రతి భాషా ఇండస్ట్రీలో కూడా మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే.;

Update: 2025-11-04 08:59 GMT

భాషతో సంబంధం లేకుండా ప్రతి భాషా ఇండస్ట్రీలో కూడా మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ వేధింపుల సమస్య నేటిది కాదు.. సావిత్రి, జమున, సూర్యకాంతం వంటి నటీమణుల కాలంలోనే ఈ వేధింపులు మొదలయ్యాయి. అయితే అప్పుడు సోషల్ మీడియా వాడకం పెద్దగా లేదు కాబట్టి ఈ ఘటనలు బయటకు వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలు ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న విషయాలను బహిరంగంగా బయట పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వీటిని బట్టి చూస్తే.. సినీ ఇండస్ట్రీలో కూడా ఆడవారికి భద్రత లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

సినీ సెలబ్రిటీలకు సినీ ఇండస్ట్రీలోనే కాదు బయట వ్యక్తులతో కూడా లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయనే వార్తలు అభిమానులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. ఇప్పుడు ఒక తెలుగు టీవీ నటికి లైంగిక వేధింపులు ఎదురవడం.. అందులోనూ సోషల్ మీడియా ద్వారా లైంగిక వేధింపులకు పాల్పడడంతో సదరు నటీమణులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి తరహాలోనే ఒక నటి వేధింపులు ఎదుర్కొంటుంది.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో.. అతడిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. మరి అసలు విషయం ఏమిటో? ఇది ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం..

అసలు విషయంలోకి వెళ్తే.. కన్నడ, తెలుగు సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఒక నటికి ఇప్పుడు ఫేస్ బుక్ ద్వారా ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. దీంతో సదరు నటి బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అంతర్జాతీయ టెక్నాలజీ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో డెలివరీ మేనేజర్ గా నిందితుడు పనిచేస్తున్నట్లు తెలుసుకొని అతడిని అదుపులోకి తీసుకొని జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.

ఆమె ఎవరు? అసలేం జరిగింది? అనే విషయానికి వస్తే.. సీరియల్స్ లో నటించే 41 ఏళ్ల నటికి, మూడు నెలల క్రితం Naveenz అనే ఫేస్బుక్ ఖాతా ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందట. అయితే ఆమె దానిని అంగీకరించకపోయినా మెసెంజర్ ద్వారా ప్రతిరోజు అసభ్యకరమైన సందేశాలు పంపడం ప్రారంభించారు. దాంతో అతడిని ఆమె బ్లాక్ చేయడంతో అనేక ఖాతాలు సృష్టించి, వేధింపులకు పాల్పడ్డాడు. ముఖ్యంగా అసభ్యకరమైన సందేశాలతో పాటు ప్రైవేట్ పార్ట్స్ వీడియోలను కూడా పంపినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. ఇకపోతే రోజు రోజుకు వేధింపులు ఎక్కువవుతున్న నేపథ్యంలో నవంబర్ 1న నిందితుడు మళ్ళీ మెసేజ్ చేయడంతో.. కలవాలని కోరిందట. అతడిని కలిసి వేధింపులు ఆపాలని హెచ్చరించినా వినలేదట.

దీంతో పోలీసులను ఆశ్రయించడంతో లైంగిక వేధింపులు, ఆన్లైన్ దుర్భాషల కింద కేసు నమోదు చేశారు. ఇకపోతే నిందితుడిని నవీన్ కే మోన్ గా గుర్తించి అరెస్టు చేశారు. ఇతడు లండన్, పారిస్ , న్యూయార్క్ వంటి నగరాలలో కార్యాలయాలు ఉన్న ఒక గ్లోబల్ సంస్థలో పనిచేసినట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నిందితుడు పై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News