• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త్రివిక్రమ్​ సార్​.....

త్రివిక్రమ్​ సార్​.. తమన్​ గురించి కాస్త చెప్తారా?

| మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

By - Tupaki Desk
Update: 2023-07-25 06:17 GMT

మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు సెన్సేషన్​ మ్యూజిక్​తో.. మరోవైపు కాపీ క్యాట్ అనే ట్యాగ్​లైన్​తో​ ఎప్పుడూ సోషల్​ మీడియాలో ట్రోల్​ అవుతూనే ఉంటారు. నిజానికి ఆయన.. ఎక్కువగా నెగెటివిటీని ఎదుర్కొంటుంటారు. తమన్​ వర్క్‌ను తక్కువ చేస్తూ.. చాలా మంది నెటిజన్లు తీవ్ర విమర్శలు కురిపిస్తుంటారు.

అయితే ఆయన ఇప్పుడు మరోసారి.. నెట్టింట్లో హాట్​ టాపిక్​గా మారారు. అందుకు కారణం 'గుంటూరు కారం'. సూపర్ స్టార్ మహేశ్​ బాబు ఈ చిత్రాన్ని ఏ ముహుర్తాన మొదలుపెట్టారోగానీ.. ఈ చిత్రం గురించి పాజిటివ్ కన్నా నెగటివ్ వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. అలా ఇప్పుడు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్​ గురించి విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆయన్ను సినిమా నుంచి తప్పించారని ప్రచారం ప్రస్తుతం జోరందుకుంది. వాస్తవానికి ఆ మధ్య కూడా ఇలానే ప్రచారం సాగింది. గుంటూర్​ కారం నుంచి తమన్ ఔట్​ అంటూ తెగ ట్రెండ్ చేశారు. ఆ సమయంలో త‌మ‌న్ ఆ వార్తలను ఖండించారు. ఆ రూమర్స్​ను తిప్పికొట్టారు. 'గుంటూరు కారం'లో తాను ఉన్నట్లు తన పనిని తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నాని చెప్పారు. అయితే మూవీటీమ్​ మాత్రం ఈ విషయంపై స్పందించకుండా మౌనం వహించింది.

క‌ట్ చేస్తే మళ్లీ ఇప్పుడూ గతంలో కన్నా ఎక్కువగా అదే ప్రచారం సాగుతోంది. త‌మ‌న్‌ పక్కాగా బయటకు వెళ్లిపోయారని అంటున్నారు. ఆయన స్థానంలోకి మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు, ఖుషీ చిత్రంతో టాలీవుడ్​కు ఎంట్రీ ఇస్తున్న హేష‌మ్ అబ్దుల్‌ను తీసుకున్నారని అంటున్నారు. అదే సమయంలో తమన్​... గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ఇచ్చిన పాత ఇంటర్వ్యూలు కూడా ట్రెండ్ అవుతున్నాయి.

ఇంకొంతమంది నెటిజన్లు.. తమన్​ ఉన్నాడో లేదో చెప్పాలంటూ త్రివిక్రమ్​ను అడుగుతూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ.. దీనిపై ఓ క్లారిటీ రావాలంటే అటు తమన్​ అయినా లేదా ఇటు మూవీటీమ్​ అయినా స్పందించాల్సి అవసరం కచ్చితంగా ఉంది.

ఇకపోతే ఈ గుంటూరు కారం సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి కష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. కథలో మార్పులు, చిత్రీకరించిన సన్నివేశాలను పక్కనపెట్టేయడం, నటీనటులు సెట్​ అవ్వకపోవడం, షూటింగ్​ పోస్ట్​పోన్​ అవ్వడం.. అబ్బో చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వచ్చేలా అన్ని సమస్యలను మీదేసుకుని ముందుకెళ్తోంది. ఆ మధ్యలో హీరోయిన్ పూజాహెగ్డే కూడా సినిమా నుంచి తప్పుకోగా.. ఆమె స్థానంలోకి శ్రీలీలను పెట్టి.. సెకండ్​ హీరోయిన్​గా మీనాక్షి చౌదరికి ఛాన్స్​ ఇచ్చారు మేకర్స్​. మరి ఇప్పుడు తమన్​ విషయంలోనూ అదే జరుగుతుందో లేదో చూడాలి..

Tags:    
  • GunturKaaram 
  • Trivikram 
  • Maheshbabu 
  • GunturKaaramMovie 
  • Thaman 
  • MusicDirector 

Similar News

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS