గురూజీ నెక్స్ట్ సమ్మర్ టార్గెట్..?

గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రం అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడని అనుకున్నారు. ఆ కాంబినేషన్ సినిమా ఫిక్స్ అవ్వడం అనౌన్స్ మెంట్ కూడా రావడం జరిగింది.;

Update: 2025-06-05 16:01 GMT

గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రం అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడని అనుకున్నారు. ఆ కాంబినేషన్ సినిమా ఫిక్స్ అవ్వడం అనౌన్స్ మెంట్ కూడా రావడం జరిగింది. కానీ పుష్ప 2 బ్లాక్ బస్టర్ అవ్వడంతో అల్లు అర్జున్ సినిమాల లెక్క కాస్త అడ్జెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. త్రివిక్రం తో చేయాల్సిన సినిమా బదులుగా అట్లీతో సినిమా లాక్ చేసుకున్నాడు అల్లు అర్జున్. ఆ సినిమా అనౌన్స్ మెంట్ వీడియోతోనే పుష్ప రాజ్ లా మాస్ మూవీనే కాదు సూపర్ హీరో మూవీతో కూడా అదరగొడతానని అల్లు అర్జున్ షాక్ ఇచ్చాడు.

బన్నీ సినిమా వాయిదా పడటంతో త్రివిక్రం నెక్స్ట్ సినిమా విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్నాడు. ఈ సినిమాను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. వెంకటేష్, త్రివిక్రం ఈ కాంబో సినిమా కోసం కొన్నేళ్లుగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఐతే వారికి తగినట్టుగానే ఈ కాంబో సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. స్టార్ డైరెక్టర్స్ సినిమాలన్నీ కూడా ఈమధ్య రెండేళ్లు పక్కా అన్నట్టుగా పరిస్థితి మారింది.

త్రివిక్రం కూడా అంతే సినిమాకు కనీసం రెండేళ్లు టైం తీసుకుంటున్నాడు. ఐతే వెంకటేష్ సినిమాకు ఆ పంథా మార్చాలని చూస్తున్నాడట. వెంకటేష్ సినిమా మొదలు పెట్టాడంటే సినిమా పూర్తి చేసే దాకా వదిలి పెట్టడు. రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్ కొట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 75 రోజుల్లో పూర్తి చేశారు.

త్రివిక్రం వెంకటేష్ సినిమా కూడా షూటింగ్ కి ఆరు నెలలు మాత్రమే టైం పెట్టుకున్నారట. నెక్స్ట్ సంక్రాంతి ఎలాగు వరుస సినిమాలు లాక్ అయ్యాయి కాబట్టి గురూజీ వెంకటేష్ సినిమా 2026 సమ్మర్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో హీరోయిన్స్ తో పాటు మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ కి సూపర్ హిట్లు ఇచ్చిన త్రివీక్రం ఇప్పుడు డైరెక్టర్ గా ఆయనతో చేస్తున్న సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందిస్తాడో చూడాలి. వెంకటేష్ మాత్రం ఈ ప్రాజెక్ట్ కోసం సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నాడని తెలుస్తుంది. మరి ఈ సినిమా విశేషాలు ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారన్నది చూడాలి.

Tags:    

Similar News