గురూజీ కొత్త వ్యక్తిని దించుతున్నాడా?
త్రివిక్రమ్ శ్రీనివాస్ లో ఓ ప్రత్యకత ఉంది. తనకు వరుసగా ఎన్ని మ్యూజికల్ హిట్స్ ఇచ్చినా? అప్పుడ ప్పుడు వాళ్లను తప్పించి కొత్త వారిని తెరపైకి తెస్తుంటారు.;
త్రివిక్రమ్ శ్రీనివాస్ లో ఓ ప్రత్యకత ఉంది. తనకు వరుసగా ఎన్ని మ్యూజికల్ హిట్స్ ఇచ్చినా? అప్పుడ ప్పుడు వాళ్లను తప్పించి కొత్త వారిని తెరపైకి తెస్తుంటారు. కొత్త వారు వస్తే తన కథకు కొత్త ఫీల్ వస్తుందని గురూజీ బలంగా నమ్ముతారు. పాటల్లో ఫ్రెష్ నెస్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందన్నది అయన ఉద్దేశం . అందుకే ఎన్ని మ్యూజికల్ హిట్స్ ఇచ్చినా? ఓ మూడు నాలుగు సినిమాల తర్వాత వారిని పక్కన బెట్టి కొత్త వాళ్లను తెరపైకి తెస్తుంటారు. ఇప్పటి వరకూ గురూజీ సినిమాలకు మణిశర్మ, దేవి శ్రీ ప్రసాద్ ఎక్కువగా పని చేసారు.
కొత్త వారితో మరో ప్రయోగం:
ఆ తర్వాత మిక్కీజే మేయర్, థమన్, అనిరుద్ కూడా సంగీతం అందించారు. మ్యూజికల్ గా ఇవన్నీ మంచి విజయాలు సాధించిన చిత్రాలే. అలా త్రివిక్రమ్ మ్యూజిక్ డైరెక్టర్లగా ఈ ఐదుగురికి పేరు ఉంది. ఈ నే పథ్యంలో తాజాగా గురూజీ కొత్త చిత్రానికి మరో సంగీత దర్శకుడిని తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా గురూజీ ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. `వెంకట రమణ` అనే టైటిల్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషలిస్ట్:
ఈ సినిమాకే హర్షవర్ధన్ రామేశ్వర్ ని సంగీత దర్శకుడిగా తీసుకుంటున్నట్లు తెలిసింది. సంగీత దర్శకుడిగా హర్షకి మంచి పేరుంది. `అర్జున్ రెడ్డి`, `యానిమల్` లాంటి సంచలన సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించింది ఇతడే. బాలీవుడ్ లో `కబీర్ సింగ్` చిత్రానికి పని చేసాడు. ఇంకా తెలుగులో `విజేత`, `సాక్ష్యం`, `టాప్ గేర్`, `రావణాసుర` సహా పలు సినిమాలకు పని చేసాడు. ఈనేపథ్యంలో త్రివిక్రమ్ అతడి పనినతం మెచ్చి తన సినిమాకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నుంచైనా గురూజీ మంచి ఔట్ పుట్ తీసుకుంటారు.
హర్ష వర్దన్ తో గురూజీ:
మ్యూజిక్ విషయంలో రాజీ పడే డైరెక్టర్ కాదు. సంగీతంలో అతడి భాగస్వామ్యం కూడా ఉంటుంది. ట్యూన్స్ ఇలా ఉండాలని ప్రతీ విషయంలో ఇన్వాల్వ్ అవుతుంటారు. అలాంటి డైరెక్టర్ కి హర్షవర్ధన్ లాంటి ప్రతిభా వంతుడు తోడైతే? ది బెస్ట్ ఔట్ పుట్ వచ్చే అవకాశం ఉంటుంది. మ్యూజికల్ గా `వెంకటరమణ`ని మిరాకిల్ చేయోచ్చు. ప్రస్తుతం హర్ష వర్దన్ తో తివిక్రమ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు ఈ నెలాఖరకు అధికారికంగా బయటకు రానున్నాయని, దసరా కానుకగా సినిమా లాంచ్ అవుతుందని వినిపిస్తోంది.