బిగ్ ట్విస్ట్:ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ మైథలాజికల్ డ్రామా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 'గుంటూరు కారం'తో భారీ డిజాస్టర్‌ని ఎదుర్కోవడం తెలిసిందే. ఈ సినిమా తరువాత తను అందరికి షాక్ ఇస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో భారీ మైథలాజికల్ డ్రామాని తెరపైకి తీసుకు రాబోతున్నానంటూ ప్రకటించారు.;

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 'గుంటూరు కారం'తో భారీ డిజాస్టర్‌ని ఎదుర్కోవడం తెలిసిందే. ఈ సినిమా తరువాత తను అందరికి షాక్ ఇస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో భారీ మైథలాజికల్ డ్రామాని తెరపైకి తీసుకు రాబోతున్నానంటూ ప్రకటించారు. దీన్ని భారీ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించి అందరిని సర్‌ప్రైజ్ చేశారు. అయితే అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్‌కు పాజ్ ఇచ్చిన అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీతో భారీ పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
దీంతో బన్నీతో త్రివిక్రమ్ చేయాలనుకున్న ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటీ? అనే చర్చ సర్వత్రా మొదలైంది. ఇదే సమయంలో ఈ ప్రాజెక్ట్‌ని ఎన్టీఆర్‌తో చేయబోతున్నాడనే వార్త బయటికి వచ్చి అందరిని షాక్ కు గురి చేస్తోంది. బన్నీ ఈ ప్రాజెక్ట్‌ని ఇప్పట్లో చేయడం కష్టమనే సంకేతాలు అందడంతో తన నిర్ణయం మార్చుకున్న త్రివిక్రమ్ తను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనుకున్న మైథలాజికల్ మూవీని ఎన్టీఆర్‌తో చేయాలని ఫిక్స్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది ఇండస్ట్రీలో బిగ్ ట్విస్ట్‌గా మారి చర్చనీయాంశం అవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ మైథలాజికల్ మూవీని యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మించాలని ప్లాన్ చేశారు. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్‌పై మీడియాతో మాట్లాడుతూ హైప్‌ని క్రియేట్ చేశారు. ఇంత వరకు ఎవరూ టచ్ చేయని మైథలాజికల్ డ్రామాతో ఈ మూవీని త్రివిక్రమ్ చేయబోతున్నారని, ఈ ప్రాజెక్ట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే స్థాయిలో ఉంటుందని భారీ అంచనాలని క్రియేట్ చేశారు.
2025 జనవరిలో ప్రోమో, మార్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ఊదరగొట్టారు. కట్ చేస్తే ఆ మాటలు ఇప్పడు తారుమారయ్యాయి. ప్రాజెక్ట్ కాస్తా బన్నీ నుంచి ఎన్టీఆర్ చేతుల్లోకి వచ్చేసింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ కమిట్ అయిన ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాకే ఇది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ `డ్రాగన్`లో నటిస్తున్నారు. దీన్ని పూర్తి చేసిన తరువాత 'దేవర 2'ని పూర్తి చేయాలి. వీటితో పాటు దాదాసహెబ్ ఫాల్కే ప్రాజెక్ట్ కూడా ఉంది.
అంతేనా 'జైలర్' ఫేమ్ నెల్సన్ డైరెక్షన్‌లోనూ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ పూర్తి చేసి త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌కు రావడానికి చాలా సమయమే పడుతుంది. ఈలోగా త్రివిక్రమ్.. వెంకటేష్, రామ్ చరణ్ ప్రాజెక్ట్‌లని పూర్తి చేయాలి. అంతే త్రివిక్రమ్ -ఎన్టీఆర్‌ల ప్రాజెక్ట్ 2027కు గానీ పట్టాలెక్కదు. ఇక ఈ మైథలాజికల్ మూవీకి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటంటే ఎన్టీఆర్ చేయనున్న తొలి మైథలాజికల్ డ్రామాగా ఈ సినిమా నిలవ నుంది. కుమారస్వీమి అంశను బ్యాక్ డ్రాప్‌గా తీసుకుని రాజమౌళి స్టార్డ్‌ని మించేలా ఈ సినిమాని త్రివిక్రమ్ తెరపైకి తీసుకురానున్నాడట. ఇదే జరిగితే ఎన్టీఆర్ కెరీర్‌లో ఇదొక తిరుగులేని సినిమాగా నిలవడం ఖాయం అని అంటున్నారు.