తారక్ ప్లేస్ లోకి బన్నీ.. గురూజీ న్యూ ప్లాన్ ఇదే!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం వెంకటేశ్ తో ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.;
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం వెంకటేశ్ తో ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్లాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చేలా ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ ఆ తరువాత చేయబోయే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
నిజానికి త్రివిక్రమ్ ఒక భారీ మైథాలజికల్ ఫాంటసీ కథను ఎప్పటి నుంచో సిద్ధం చేస్తున్నారు. అల్లు అర్జున్ తో చాలాసార్లు చర్చలు జరపడమే కాకుండా అప్పట్లో ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. కానీ మళ్ళీ హఠాత్తుగా లైన్ లోకి ఎన్టీఆర్ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. బన్నీ అప్పట్లో పుష్ప 2తో బిజీ అవ్వడం ఆ తరువాత వెంటనే అట్లీ తో కలవడంతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లాల్సి వచ్చింది. ఇది కార్తికేయ స్వామి ఇతివృత్తంతో సాగే అద్భుతమైన కథ అని, రామాయణం కంటే పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని నిర్మాత నాగవంశీ గతంలోనే హింట్ ఇచ్చారు.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మురుగా: ది లార్డ్ ఆఫ్ వార్ పుస్తకం చదువుతున్న ఫోటోలు బయటకు రావడంతో, తారక్ త్రివిక్రమ్ కాంబో ఫిక్స్ అని అందరూ డిసైడ్ అయ్యారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ విషయంలో త్రివిక్రమ్ మళ్ళీ ప్లాన్ మార్చినట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఎన్టీఆర్ స్థానంలో ఇప్పుడు అల్లు అర్జున్ ఈ మైథాలజికల్ సినిమాలో నటించే ఛాన్స్ గట్టిగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ బిజీగా ఉండడంతో ఇప్పుడు బన్నీకి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ముగ్గురి మధ్యలో మంచి బాండింగ్ ఉండడంతో ఫ్రెండ్లీగానే మార్పులు జరిచినట్లు సమాచారం.
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఇలాంటి హిస్టారికల్ పాయింట్ తో బన్నీని చూడటం ఫ్యాన్స్ కు కొత్త కిక్ ఇస్తుంది.
ప్రస్తుతం బన్నీ.. అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నారు. దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్, మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే బన్నీ.. త్రివిక్రమ్ సినిమా కోసం డేట్స్ కేటాయించే ప్లాన్ లో ఉన్నారట.
అన్నీ కుదిరితే 2027 మార్చిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈలోపు త్రివిక్రమ్ వెంకటేశ్ సినిమాను పూర్తి చేసి, ప్రీ ప్రొడక్షన్ పనులపై ఫుల్ ఫోకస్ పెడతారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే ఈ విజువల్ వండర్ ఇండియన్ స్క్రీన్ మీద సరికొత్తగా ఉంటుందట. స్టోరీ, విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తారట. ఇక ఈ కలయికపై అసలు క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.