మొన్న అలియా భట్.. ఇప్పుడు త్రిష..
రీసెంట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో సూపర్ హిట్ ను తన అకౌంట్ లో వేసుకున్న త్రిష సుమారు రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో సత్తా చాటుతుంది;

నాలుగు పదుల వయసులో కూడా త్రిష చేతినిండా సినిమాలతో కెరీర్లో దూసుకెళ్తుంది. రీసెంట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో సూపర్ హిట్ ను తన అకౌంట్ లో వేసుకున్న త్రిష సుమారు రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో సత్తా చాటుతుంది. మధ్యలో కెరీర్ కు బ్రేక్ వచ్చినప్పటికీ పొన్నియన్ సెల్వన్ తర్వాత అమ్మడి క్రేజ్ పెరిగింది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా త్రిషకు మంచి ఆఫర్లు దక్కుతున్నాయి.
తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో నటించిన త్రిష చేతిలో ప్రస్తుతం థగ్ లైఫ్, విశ్వంభర సినిమాలున్నాయి. కమల్ హాసన్ సరసన మణిరత్నం దర్శకత్వంలో త్రిష నటించిన థగ్ లైఫ్ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. జూన్ 5న థగ్ లైఫ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా పలు ఈవెంట్స్ లో పాల్గొంటున్న త్రిష కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటుంది.
మలయాళీ నటుడు ఫహాద్ ఫాజిల్ అంటే తనకు ఇష్టమని, ఆయనతో కలిసి నటించడం తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. మీరు ఎవరితో నటించాలనుకుంటున్నారని రీసెంట్ గా ఓ సందర్భంలో త్రిషను అడగ్గా అమ్మడు ఫహాద్ ఫాజిల్ పేరు చెప్పింది. ఫహాద్ ఫాజిల్ తో నటించాలనుంది. అతనెలాంటి కథనైనా, ఎలాంటి క్యారెక్టర్‌లో అయినా అద్బుతంగా నటించగలడు. అతను చాలా అద్భుతమైన నటుడు అని మనసులోని మాటను బయటపెట్టింది త్రిష.
త్రిష చెప్పినట్టు ఫహాద్ చాలా గొప్ప నటుడు. ఎలాంటి పాత్రనైనా, ఎలాంటి సినిమానైనా చేయగల కెపాసిటీ ఉన్న యాక్టర్. మొన్నటికి మొన్న అలియా భట్ కూడా ఫహాద్ అంటే ఇష్టమని, కచ్ఛితంగా అవకాశం వస్తే అతనితో కలిసి నటించడానికి రెడీగా ఉన్నానని చెప్పింది. ఇప్పుడు త్రిష కూడా ఫహాద్ అంటే ఇష్టమని, తనతో కలిసి నటించాలనుందని తెలిపింది. ఇక థగ్ లైఫ్ విషయానికొస్తే ఈ సినిమా నాయగన్ ను మించి ఉంటుందని చిత్ర యూనిట్ మొత్తం ఎంతో గొప్పగా చెప్తుంది. దీంతో పాటూ త్రిష, చిరంజీవితో చేస్తున్న విశ్వంభర సినిమాపై కూడా అందరిక మంచి అంచనాలున్నాయి.