సైమా వేదికగా విషెస్..ఇదా అసలు సంగతి!
దళపతి విజయ్ తమిళనాడు ఎన్నికల్లో బరిలోకి ఒంటరిగా దిగుతోన్న సంగతి తెలిసిందే. ఎలాంటి పొత్తులు లేకుండా సోలోగానే రాజకీయాల్లోనూ జయకేతనం ఎగరేసే దిశగా అడుగులు వేస్తున్నారు.;
దళపతి విజయ్ తమిళనాడు ఎన్నికల్లో బరిలోకి ఒంటరిగా దిగుతోన్న సంగతి తెలిసిందే. ఎలాంటి పొత్తులు లేకుండా సోలోగానే రాజకీయాల్లోనూ జయకేతనం ఎగరేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యర్ధి ఎంత బలవంతుడైనా పోరాటం మాత్రం ఆగదంటున్నాడు. గెలుపుపై ఎప్పటికప్పుడు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే చిత్ర పరిశ్రమ నుంచి విజయ్ కు మద్దతు ఎంత వరకూ ఉంటుందన్నది ఇంకా తేలలేదు. రజనీ కాంత్ మాత్రం అధికార పార్టీ పక్షాన ఉన్నారు? అన్నది క్లియర్ గా ఉంది. ఆపార్టీకి మద్దతిస్తూ ఓ సంద ర్భంలో విజయ్ పై విమర్శలు కూడా చేసారు.
దుబాయ్ వేదికగా పొలిటికల్ హింట్:
ఇంకా ఈ విషయంలో ఓపెన్ అవ్వాల్సిన మరో సెలబ్రిటీ కమల్ హాసన్. ఆయన కూడా ఓ పార్టీ స్థాపించిన నేపథ్యంలో అతడి మద్దతు ఎవరికి ఉంటుందన్నది చూడాలి. అలాగే కోలీవుడ్ నుంచి ఇంకెంత మంది విజయ్ కి మద్దతుగా నిలుస్తారు? అన్న దానిపై అంతే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనూ దుబాయ్ వేదికగా విజయ్ కి నటి త్రిష కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు. తాను కోరుకున్న రాజకీయాల్లో రాణించా లని... కచ్చితంగా సక్సెస్ అవుతాడని ధీమా వ్యక్తం చేసారు.
విజయ్ పార్టీలో చేరుతుందా:
త్రిష ఇలా ఓపెన్ అవ్వడానికి కారణం లేకపోలేదు. ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కలిసి సినిమాలు చేసారు. ఆ కారణంగా విజయ్ కి విషెస్ తెలియ జేసింది. అయితే ఇవి ఇప్పటి వరకూ శుభా కాంక్షలే అయినా? భవిష్యత్ లో తాను స్నేహితుడి మద్దతుగా నిలబడుతూ అదే పార్టీలో చేరే అవకాశం ఉందని కోలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. సైమా వేదికగా విషెస్ వెనుక అసలు కారణం అదేనని ఓ మీడియా సంస్థ కథనంలో పేర్కొంది. మరి ఈ ప్రచారంలో నిజానిజాలు నిగ్గు తేలాలి.
కోలీవుడ్ సెలబ్రిటీలకు రాజకీయం కొత్తేం కాదు:
ప్రస్తుతం త్రిష సినిమా కెరీర్ కూడా ఏమంత యాక్టివ్ గా లేదు. మంచి అవకాశాలు వస్తే నటిచండం తప్ప? తాను కూడా నటనను అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించలేదు. నటిగా చాలా సినిమాలు చేసింది. రెండున్నర దశాబ్దాల ప్రయాణం ఆమె సొంతం. తెలుగు సహా తమిళ, హిందీ పరిశ్రమలోనూ పని చేసింది. ఈ నేపథ్యంలో త్రిష రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లడం అన్నది కోలీవుడ్ లో చాలా కాలం ఉన్న సంప్రదాయమే.