త్రిష మెడలో ఉన్న ఆ పచ్చలహారంపైనే పెళ్లిలో కళ్లన్నీ
సాధారణంగా పెళ్లిళ్లకు సామాన్య ప్రజలు కూడా ఒరిజినల్ బంగారం, వజ్రాలు, కెంపులతో కూడుకున్న ఆభరణాలను ధరించేందుకు ప్రాధాన్యతనిస్తుంటారు.
సాధారణంగా పెళ్లిళ్లకు సామాన్య ప్రజలు కూడా ఒరిజినల్ బంగారం, వజ్రాలు, కెంపులతో కూడుకున్న ఆభరణాలను ధరించేందుకు ప్రాధాన్యతనిస్తుంటారు. చుట్టాల దగ్గర హొయలు పోయేందుకు గృహిణులకు ఇదో మంచి అవకాశం. పిచ్చి బంగారంగా చెప్పుకునే నాశిరకం రోల్డ్ గోల్డ్ ని అస్సలు ఉపయోగించేందుకు ఇష్టపడరు.
ఇప్పుడు ఖుష్బూ కుమార్తె ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో స్టార్ హీరోయిన్ త్రిష క్రిష్ణన్ ధరించిన ఆ అద్భుతమైన పచ్చల హారం (ఎమరాల్డ్ అండ్ డైమండ్ నెక్లెస్) ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆభరణం ఒరిజినలేనా? అంటూ ఒక డిస్కషన్ మొదలైంది. అయితే ఈ ఆభరణం చూడటానికి సాదాసీదాగా కనిపించినా కానీ, త్రిష రేంజు నటికి రోల్డ్ గోల్డ్ ధరించాల్సిన అవసరం లేనే లేదు. జ్యువెలరీ మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం దీని విలువ సుమారు రూ. 1.5 కోట్ల నుండి రూ. 3 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ హారం అంత ఖరీదు ఉండటానికి గల ప్రధాన కారణాలు కూడా విశ్లేషిస్తున్నారు.
ఇది ప్యూర్ కొలంబియన్ లేదా జాంబియన్ ఎమరాల్డ్స్ నెక్లెస్. దీనిలో వాడిన పచ్చలు (ఎమరాల్డ్స్) చాలా పెద్దవిగా, అత్యంత నాణ్యమైన రంగుతో మెరుస్తున్నాయి. రత్నాలలో నాణ్యమైన పచ్చల ధర వజ్రాలతో సమానంగా లేదా కొన్నిసార్లు వాటికంటే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అన్‌కట్ డైమండ్స్ (పోల్కి) ఎంతో విలువైనవి. పచ్చల చుట్టూ పొదిగిన వజ్రాలు వింటేజ్ లుక్ ఇచ్చే పోల్కి రకానికి చెందినవి. ఇవి జ్యువెలరీ విలువను భారీగా పెంచుతాయి. త్రిష లాంటి సెలబ్రిటీలు ధరించే ఆభరణాలు ప్రముఖ లగ్జరీ బ్రాండ్స్‌కు చెందిన కస్టమైజ్డ్ డిజైన్లు అయి ఉంటాయి. కాబట్టి మేకింగ్ ఛార్జీలు, బ్రాండ్ వాల్యూ కూడా ఇందులో కలిసే ఉంటాయి. ధగధగలాడే ఈ రాయల్ పచ్చల హారంతో త్రిష క్లాసిక్ లుక్, పెళ్లి వేడుకలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ నేపథ్యంలో త్రిష ధరించిన ఆ అద్భుతమైన డిజైనర్ డ్రెస్ ఖరీదు ఎంత ఉండవచ్చు? అనే దానిపై కూడా ఫ్యాషన్ ప్రియులలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. త్రిష ధరించిన సాంప్రదాయ -మోడ్రనైజ్డ్ లెహంగా భారతదేశంలోని ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ బ్రాండ్‌కు చెందినదిగా తెలుస్తోంది. సాధారణంగా త్రిష లాంటి టాప్ స్టార్స్ ఇటువంటి ప్రతిష్టాత్మక వేడుకల కోసం ఎంచుకునే డిజైనర్ దుస్తుల ధరలు వాటిపై చేసిన ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ క్వాలిటీ - బ్రాండ్ వాల్యూని బట్టి సుమారు రూ. 1.5 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు లేదా అంతకంటే ఎక్కువే ఉండే అవకాశం ఉంది.
ఏదేమైనా ఆ రాత్రి గోవా తీరాన జరిగిన ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో త్రిష ఎంపిక చేసుకున్న రాయల్ పచ్చల హారం - దానికి నప్పేలా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ తనను ఒక ప్రత్యేకమైన మహారాణిలా రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి తెచ్చాయి. పెళ్లి వేడుకల్లో రాయల్ ఎలిగెన్స్ - క్లాసిక్ లుక్‌ను ఇష్టపడే నేటితరం యువతులకు, ఫ్యాషన్ ప్రియులకు త్రిష ఈ సరికొత్త ప్రీ-వెడ్డింగ్ లుక్ ఒక పర్ఫెక్ట్ స్టైల్ స్టేట్‌మెంట్‌గా నిలిచిందని చెప్పవచ్చు.
ప్రస్తుతం త్రిష కెరీర్ మ్యాటర్ కి వస్తే..టాలీవుడ్‌లో అత్యంత భారీ అంచనాలు ఉన్న చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి సాషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్ `విశ్వంభర`పై త్రిషకు భారీ హోప్స్ ఉన్నాయి. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో త్రిష `అవని` అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది. చిరంజీవి, త్రిష కాంబినేషన్‌లో గతంలో వచ్చిన `స్టాలిన్` చిత్రం తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండటంతో టాలీవుడ్‌లో తన గ్రాండ్ కమ్‌బ్యాక్‌పై భారీ ఆశలు నెలకొన్నాయి.
ఇప్పటికే విడుదలైన `విశ్వంభర` గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. భారీ వీఎఫ్ఎక్స్ (VFX) - గ్రాఫిక్స్‌తో కూడిన ఈ విజువల్ వండర్ 2026 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇటు గోవా పెళ్లి వేడుకల్లో పచ్చల హారంతో నిజజీవితంలో మహారాణిలా మెరిసిన త్రిష.. ఈ వేడుకల్లో చిరంజీవితో ఎక్కువ సమయం గడపడం అందరి దృష్టిలో పడింది. ఆ ఇద్దరూ విశ్వంభర ప్రమోషన్స్ కి రెడీ అవుతున్నారా? అన్న ఆసక్తి మొదలైంది. అయితే మేకర్స్ `విశ్వంభర` అధికారిక రిలీజ్ తేదీని... ప్రమోషనల్ స్ట్రాటజీని ఇంకా వెల్లడించాల్సి ఉంది.