వారికి త్రిష స్పెషల్ థ్యాంక్స్.. డిస్టర్బెన్స్ క్లియర్ అయిందా?

సౌత్ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్‌ గా కొనసాగుతున్న త్రిష మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారారు.

Update: 2026-05-24 06:54 GMT

సౌత్ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్‌ గా కొనసాగుతున్న త్రిష మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారారు. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు తన పర్సనల్ లైఫ్, పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలతో కూడా ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన కరుప్పు సినిమా మంచి వసూళ్లు సాధించడంతో త్రిష అభిమానులకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తమిళ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో నటించిన కరుప్పు చిత్రాన్ని దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించారు. తెలుగులో ఆ సినిమాను వీరభద్రుడు పేరుతో విడుదల చేశారు. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌ తో వచ్చిన ఆ మూవీ విడుదలైన మొదటి రోజు నుంచే మిక్స్‌ డ్ టాక్ తెచ్చుకుంది. కథ, స్క్రీన్‌ ప్లే విషయంలో కొంత విమర్శలు వచ్చినా.. సూర్య స్క్రీన్ ప్రెజెన్స్‌, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని సినీ ప్రియులు చెబుతున్నారు..

ఇక సినిమాలో త్రిష పాత్ర విషయానికి వస్తే.. ఆమెకు పెద్దగా ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. కొన్ని సన్నివేశాల్లో తన ఎక్స్పీరియన్స్ ను చూపించినా.. మరికొన్ని సీన్లలో ఆమె లుక్‌ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. ముఖ్యంగా చాలా సన్నగా కనిపించారని కొందరు కామెంట్ చేశారు. అయినప్పటికీ త్రిష స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అభిమానులను ఆకట్టుకుందని ఆమె ఫ్యాన్స్ చెబుతున్నారు.

సినిమాకు మిక్స్‌ డ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం కరుప్పు మంచి కలెక్షన్లు సాధిస్తోంది. విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. దీంతో మూవీ టీమ్ ప్రత్యేకంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకల్లో సూర్య, ఆర్జే బాలాజీతోపాటు త్రిష కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రిష కేక్ కట్ చేసి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం ఆ వీడియోను తన ఇన్‌ స్టా స్టోరీలో షేర్ చేస్తూ అభిమానుల ప్రేమకు థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత కరుప్పు మూవీ టీమ్‌ తో కలిసి త్రిష ఇలా కనిపించడం ఫ్యాన్స్‌ కు సర్ప్రైజ్‌ గా మారింది. అసలు సినిమా విడుదల సమయంలో త్రిష, మూవీ టీమ్ మధ్య ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఏర్పడిందనే ప్రచారం జరిగింది.

కారణం.. విడుదల సమయంలో త్రిష సోషల్ మీడియాలో చేసిన కొన్ని పోస్టులు, వాటికి ఇచ్చిన రిప్లైలు వైరల్ కావడమే. దీంతో ఆమె ప్రమోషన్స్‌ కు దూరంగా ఉంటున్నారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సక్సెస్ సెలబ్రేషన్స్‌ లో పాల్గొనడంతో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టైంది. ఏదేమైనా.. కరుప్పు విజయంతో త్రిష మరోసారి వార్తల్లో నిలవగా.. అభిమానులకు ఆమె చెప్పిన స్పెషల్ థ్యాంక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

Tags:    

Similar News