థగ్ లైఫ్.. అసలెందుకు చేశావ్ త్రిష?

ముఖ్యంగా త్రిష రోల్ ను డిజైన్ చేసి తీరు పట్ల చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో త్రిషది వ్యాంప్ క్యారెక్టర్ లా అనిపిస్తుంది.;

Update: 2025-06-06 05:58 GMT

స్టార్ హీరో కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ తెరకెక్కిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ నాయగన్ మూవీ వచ్చిన కొన్నేళ్ల తర్వాత మరోసారి వారి కాంబో రిపీట్ అయింది. స్టార్ హీరోయిన్ త్రిష ఫిమేల్ లీడ్ రోల్ పోషించగా.. ఆమెతో పాటు శింబు, అభిరామి, జోజు జార్జ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొల్పిన థగ్ లైఫ్.. నిన్న (జూన్ 5న) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజైంది. కానీ సినిమా మాత్రం అనుకున్నంత రెస్పాన్స్ సంపాదించుకోలేకపోయింది. రొటీన్ గ్యాంగ్ స్టర్ కథ, కథనంతో పాటు బాగా సాగదీసిన ఎమోషనల్ డ్రామాగా థగ్ లైఫ్ ఉందని సోషల్ మీడియాలో రివ్యూస్ వస్తున్నాయి.

అదే సమయంలో త్రిష థగ్ లైఫ్ లో నటిస్తుండడంతో ఆమె పాత్రపై అంతా మంచి హోప్స్ పెట్టుకున్నారు. అయితే ట్రైలర్ లో కమల్- త్రిష రొమాన్స్ సీన్ ఉండడంతో విమర్శలు భారీగా వచ్చాయి. కానీ సినిమా వచ్చాక ఎలా ఉంటుందో చూద్దామనుకున్నారు. ఇప్పుడు మూవీ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ డిస్సపాయింట్ అయిపోయారు.

ముఖ్యంగా త్రిష రోల్ ను డిజైన్ చేసి తీరు పట్ల చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో త్రిషది వ్యాంప్ క్యారెక్టర్ లా అనిపిస్తుంది. కమల్, శింబులకు ప్రేయసిగా ఉంటుంది త్రిష క్యారెక్టర్. సింపుల్ గా చెప్పాలంటే.. తండ్రి కొడుకు పాత్రలు ఒకే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నట్లు అనిపిస్తుంది. రొమాన్స్ కే పాత్ర ఉన్నట్లు అనిపిస్తుంటుంది.

అయితే అదంతా ఒకెత్తు అయితే.. చివర్లో త్రిష పాత్రను చంపేస్తారు. అసలు ఆమె రోల్ కు.. సినిమా స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఏదో రోల్ ను జస్ట్ పెట్టినట్లు అనిపిస్తుంటుంది. దీంతో ఇప్పుడు త్రిష పాత్రను మణిరత్నం ఎందుకు రాసుకున్నారో తెలియడం లేదని.. అదేంటో ఆయనకు మాత్రమే తెలియాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అదే సమయంలో ఇంత పరిమిత పాత్ర అంగీకరించినందుకు త్రిషను కూడా విమర్శిస్తున్నారు. తన రోల్ కు కథలో ఇంపార్టెన్స్ లేకపోయినా ఎందుకు చేశారని అడుగుతున్నారు. మణిరత్నం, కమల్ హాసన్ సినిమా అనే రీజన్ తో చేశారా అని అంటున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న త్రిష.. ఇప్పుడు థగ్ లైఫ్ చేయడంపై మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News