గిర‌జాల జుట్టుతో గిల్లుతున్న త్రిష‌

ఇప్పుడు మ‌రోసారి త‌న కొత్త సినిమా `గుడ్ బ్యాడ్ అగ్లీ` రిలీజ్ కి రెడీ అవుతున్న వేళ త్రిష ఇదే క‌ర్లీ హెయిర్ తో మ‌న‌సులు కొల్ల‌గొడుతోంది.;

Update: 2025-04-10 03:37 GMT

అందం ఆక‌ర్ష‌ణ ఒక్కొక్క‌రిలో ఒక్కో పాయింట్ నుంచి ఎలివేట్ అవుతాయి. స్టార్ హీరోయిన్ త్రిష అంద‌మంతా ఆ న‌వ్వు, గిర‌జాల జుట్టులోనే దాగి ఉంది. దశాబ్ధాలుగా ఆ క‌ర్లీ హెయిర్‌తో గుండెల్ని మెలి తిప్పుతూనే ఉంది. ఇప్పుడు మ‌రోసారి త‌న కొత్త సినిమా `గుడ్ బ్యాడ్ అగ్లీ` రిలీజ్ కి రెడీ అవుతున్న వేళ త్రిష ఇదే క‌ర్లీ హెయిర్ తో మ‌న‌సులు కొల్ల‌గొడుతోంది.


త‌ళా అజిత్ కుమార్ క‌థానాయ‌కుడిగా నటించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమా నుండి కొత్త స్టిల్స్ లో త్రిష కృష్ణన్ గిరజాల జుట్టు లుక్ అభిమానుల హృద‌యాల‌ను దోచుకుంది. ఈ చిత్రం ఈరోజు (ఏప్రిల్ 10) విడుద‌ల కాగా, అజిత్ అభిమానుల్లో ఉత్కంఠ నెల‌కొంది. అయితే ఈ సినిమాకి స‌రైన ప్ర‌మోష‌న్స్ లేక‌పోవ‌డం దుర‌దృష్టం. త‌మిళ‌నాడు వ‌ర‌కూ ప్రమోషన్లు లేకుండానే అజిత్ అభిమానులలో మంచి బజ్‌ను సృష్టించగలిగింది. విడుదల స‌మ‌యంలో త్రిష స్టిల్స్ వెబ్ లో వైర‌ల్ గా మారాయి. త్రిష ఈ స్టిల్స్ లో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా చాలా అందంగా క‌నిపిస్తోంది. రింగుల జుత్తు మాయాజాలం యువ హృద‌యాల‌పై ప‌ని చేస్తోంది.


గుడ్ బ్యాడ్ అగ్లీ లో రమ్య అనే పాత్ర‌లో త్రిష క‌నిపించ‌నుంది. తాజాగా రిలీజైన స్టిల్స్ పై ఫ్యాన్స్ త‌మ ప్రేమ‌ను కురిపించారు. ``ఎప్పటికీ చాలా అందంగా ఉంది`` అని ఒక అభిమాని వ్యాఖ్యానించ‌గా, ``పిఎస్‌ త్రిష అజగా ఇరుక తర్వాత మొదటి చిత్రం...``అని వేరొక‌రు రాశారు, మరొకరు ``చాలా అద్భుతంగా ఉంది ఓ మై లార్డ్`` అని వ్యాఖ్యానించారు.

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ`ని మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో విడుద‌ల చేస్తోంది. తన కొడుకు కిడ్నాప్ కి గుర‌య్యాక‌.. తిరిగి తన హింసాత్మక మార్గాల్లోకి లాగబడిన మాజీ దోషి కథ ఇది. త్రిష - అజిత్ ప్రధాన పాత్రల‌లో నటించ‌గా, అర్జున్ దాస్, సునీల్, జాకీ ష్రాఫ్ కూడా ముఖ్యమైన పాత్రల్లో క‌నిపిస్తున్నారు. ఇది అజిత్ 63వ చిత్రం. ఈ చిత్రానికి జి. వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, అబినాధన్ రామానుజం సినిమాటోగ్రఫీని అందించారు.

Tags:    

Similar News