ఎలక్షన్స్ రిజల్ట్స్ వేళ త్రిష ఊహించని పోస్ట్!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ బ్యూటీగా వెలిగిపోతున్న త్రిష, తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.;
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ బ్యూటీగా వెలిగిపోతున్న త్రిష, తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ హడావిడి ఒకవైపు, త్రిష పుట్టినరోజు వేడుకలు మరోవైపు ఉండటంతో అభిమానుల్లో జోష్ నెలకొంది. ఇంస్టాగ్రామ్ లో ఆమె పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. అసలు త్రిష ఈ పోస్ట్ వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? ఆమె అప్ కమింగ్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మే(మీ)సీజన్ మొదలైంది!:
సాధారణంగా మే నెల వచ్చిందంటే ఎండల వేడి గుర్తొస్తుంది. కానీ త్రిషకు మాత్రం ఇది తన సొంత సీజన్. మే 4వ తేదీన త్రిష పుట్టినరోజు కావడంతో, తన బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయని చెబుతూ చాలా తెలివిగా "May(me)" అని పోస్ట్ చేశారు. అంటే మే నెల మరియు తనను (Me) కలిపి ఈ క్యాప్షన్ ఇచ్చారు. బ్లాక్ స్లీవ్‌లెస్ టాప్, జీన్స్‌లో త్రిష కనిపిస్తున్న ఈ స్టైలిష్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
లాయర్ గెటప్‌లో ప్రీతి సందడి:
త్రిష సినిమాల విషయానికి వస్తే, చాలా కాలం తర్వాత సూర్యతో కలిసి ఆమె నటించిన 'కరుప్పు' చిత్రం మే 14న విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో ఈ సినిమా ‘వీరభద్రుడు’ పేరుతో వస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి త్రిష పోషిస్తున్న 'ప్రీతి' పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇక ఇందులో ఆమె లాయర్ కోటు వేసుకుని చాలా గంభీరంగా, చీరకట్టులో ఎంతో పద్ధతిగా కనిపిస్తూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది.
రెండు దశాబ్దాల తర్వాత సూర్యతో..:
సూర్య, త్రిష జంట అంటే సినీ ప్రేమికులకు ఒక ప్రత్యేకమైన క్రేజ్. దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో వీరు మళ్లీ కలిసి నటిస్తుండటంతో 'వీరభద్రుడు' సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాతో పాటు త్రిష చేతిలో మరిన్ని సెన్సేషనల్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర', మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో 'రామ్' చిత్రాల్లో ఆమె నటిస్తూ బిజీగా గడుపుతోంది.
తమిళనాడు ఎన్నికల ఫలితాల ఉత్కంఠ మధ్య త్రిష పుట్టినరోజు రావడం విశేషం. వివాదాలు ఏవైనా సరే, కెరీర్ పరంగా మాత్రం త్రిష ప్రస్తుతం గోల్డెన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తోంది. అటు బర్త్ డే సెలబ్రేషన్స్, ఇటు వరుస భారీ సినిమాల విడుదలలతో ఈ మే నెల మొత్తం త్రిష నామస్మరణతో మారుమోగిపోనుంది. ఇక తన ఆత్మవిశ్వాసంతో, అందంతో మరోసారి సౌత్ ఇండియాను ఏలేందుకు ఈ చెన్నై చిన్నది సిద్ధమైపోయింది.