న‌టిగా ఫెయిల‌తే త్రిష సైకాల‌జిస్ట్!

అందాల త్రిష సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. వ‌ర‌స‌గా సీనియ‌ర్ హీరోల‌తో ఛాన్సులందుకుంటూ బిజీగా ఉంది.;

Update: 2025-05-09 01:30 GMT

అందాల త్రిష సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. వ‌ర‌స‌గా సీనియ‌ర్ హీరోల‌తో ఛాన్సులందుకుంటూ బిజీగా ఉంది. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తైన సినిమాలు కొన్ని అయితే క‌మిట్ అయిన చిత్రాలు మ‌రికొన్ని. ఇవ‌న్నీ స‌క్సెస్ అయితే త్రిష కెరీర్ కి ఇంకొన్నాళ్లు తిరుంగుడ‌దు. వ‌య‌సుతో సంబంధం లేకుండా కొత్త అవ‌కాశాలు అందుకోల్గుతుంది. న‌టిగా ఇప్ప‌టికే చాలా సినిమాలు చేసింది.

ఇండ‌స్ట్రీలో సుదీర్ఘ అనుభ‌వం సంపాదించింది. త్రిష‌కు తీర‌ని డ్రీమ్ రోల్స్ ఏవైనా ఉన్నాయా? అంటే ప్రిన్సెస్ త‌ర‌హా పాత్ర‌లు ఒక్క‌టే మిగిలి ఉన్నాయి. అలాగే లేడీ ఓరియేంటెడ్ నాయిక‌గానూ ప్రూవ్ చేసుకోలేక‌పోయింది మిన‌హా దాదాపు అన్ని ర‌కాల పాత్ర‌లు పోషించింది. ఇదంతా ఒకే ఒక‌వేళ త్రిష న‌టి అవ్వ‌క పోయి ఉంటే? ఇంకే రంగంలో ఉండేది? అన్న ప్ర‌శ్న ఆమె ముందుకెళ్లింది.

దీనికి అమ్మ‌డు ఏమ‌ని బ‌ధులిచ్చిందో తెలుసా? మంచి సైకాల‌జిస్ట్ ను అయ్యేదాన్ని అని తెలిపింది. న‌ట‌న‌కంటే ముందే సైకాల‌జిస్ట్ అవ్వాల‌నుకుందిట‌. ఆ ర‌క‌మైన చ‌దువులు పూర్తి చేసిందిట‌. అదే స‌మ యంలో అందాల పోటీల్లో కూడా పాల్గొన‌డంతో అక్క‌డ స‌క్సెస్ అవ్వ‌డంతో యాడ్స్ లో న‌టించే ఛాన్సులు రావ‌డం... అదే స‌మ‌యంలో సినిమాకి అవ‌కాశం రావ‌డంతో జీవితం కొత్త ట‌ర్నింగ్ తీసుకుంద‌ని తెలి పింది.

త్రిష `నీ మనసు నాకు తెలుసు` అనే తెలుగు చిత్రంతోనే ఇక్క‌డ కెరీర్ ప్రారంభించింది. అటుపై `వర్షం`, `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `అతడు`, `పౌర్ణమి`, `స్టాలిన్` లాంటి వ‌రుస విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రెండు ద‌శాబ్ధాల‌కు పైగా తెలుగులో కెరీర్ కొన‌సాగించింది. ఇప్ప‌టికీ న‌వ‌త‌రం భామ‌ల నుంచి పోటీని ఎదుర్కుంటూ సినిమాలు చేస్తుంది.

Tags:    

Similar News