ప్ర‌భాస్ `స్పిరిట్` హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?

ట్రిప్తి దిమ్రీ నేటి జెన్ జెడ్ యూత్ క‌ల‌ల రాణి. యానిమ‌ల్ చిత్రంతో న‌టిగా ఈ బ్యూటీ ప్ర‌తిభ ప్ర‌పంచానికి తెలిసింది.;

Update: 2025-05-26 06:36 GMT

ట్రిప్తి దిమ్రీ నేటి జెన్ జెడ్ యూత్ క‌ల‌ల రాణి. యానిమ‌ల్ చిత్రంతో న‌టిగా ఈ బ్యూటీ ప్ర‌తిభ ప్ర‌పంచానికి తెలిసింది. యానిమ‌ల్ కంటే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన సినిమాలు కెరీర్ లో ఉన్నా, త‌న‌కు ఆశించిన గుర్తింపు ద‌క్క‌లేదని హిందీ మీడియాలు క‌థ‌నాలు ప్ర‌చురించాయి. అగ్ర క‌థానాయ‌కుడు ర‌ణ‌బీర్ స‌ర‌స‌న చిన్న పాత్ర‌తోనే పెద్ద గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా త‌ర్వాత బ్యాడ్ న్యూజ్ స‌హా ప‌లు హిట్ సినిమాల్లో న‌టించింది ట్రిప్తీ. బాలీవుడ్ లో రేర్ ట్యాలెంట్ అంటూ ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

ప్ర‌భాస్ స‌ర‌స‌న `స్పిరిట్` లాంటి భారీ పాన్ ఇండియ‌న్ చిత్రంలో క‌థానాయిక‌గా ఎంపిక చేసి మ‌రోసారి షాకిచ్చాడు సందీప్ వంగా. ఇది ట్రిప్తీకి ఊహించ‌ని అవ‌కాశం. దీపిక ప‌దుకొనే లాంటి అగ్ర క‌థానాయిక స్థానంలో ట్రిప్తీని ఎంపిక చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ట్రిప్తి త‌న‌ను తాను నిరూపించుకునేందుకు ఇది స‌రైన స‌మ‌యం. ఈ ప్ర‌త్యేక సంద‌ర్భంలో ట్రిప్తి దిమ్రీ కెరీర్ గ్రాఫ్, ఆదాయం, సంప‌ద‌ల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ముఖ్యంగా ట్రిప్తీ బాంద్రా- ముంబైలో ఇటీవ‌లే ఒక కొత్త అపార్ట్ మెంట్ కొనుగోలు చేసింది. ఈ అపార్ట్ మెంట్ ధ‌ర 14 కోట్లు. స్టాంప్ డ్యూటీ కోసం భారీ మొత్తంలో చెల్లించింది. ఈ బంగ్లా గేలాక్సీకి అత్యంత స‌మీపంలో, షారూఖ్ ఖాన్, ర‌ణ‌బీర్ క‌పూర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల ఇంటికి సమీపంగా ఉంద‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి. 2226 చద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో అత్యంత విలాస‌వంత‌మైన అపార్ట్ మెంట్ టాప్ సెల‌బ్రిటీల నివాసాల‌కు స‌మీపంగా ఉంది. ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు 4-6 కోట్ల మ‌ధ్య‌ పారితోషికం అందుకుంటోంది. యానిమ‌ల్ త‌ర్వాత నెట్ ఫ్లిక్స్ సిరీస్ కోసం 80ల‌క్ష‌లు అందుకున్న ట్రిప్తీ ఇటీవ‌ల భారీగా పారితోషికం పెంచేసింది. ఉత్త‌రాఖండ్ లోని ఒక చిన్న ప‌ట్ట‌ణంలో జ‌న్మించిన ట్రిప్తి ఒక సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వచ్చింది. చాలా త‌క్కువ స‌మ‌యంలో దాదాపు 30 కోట్ల మేర నిక‌ర ఆస్తుల‌ను క‌లిగి ఉంద‌ని టైమ్స్ త‌న క‌థ‌నంలో పేర్కొంది.

Tags:    

Similar News