టాప్ 10 'ఫుట్‌ఫాల్స్'.. ఆ సినిమా దరిదాపుల్లో కూడా ఎవరూ లేరుగా..

ఈ విషయంలో, ఇండియన్ సినిమా హిస్టరీలో క్రియేట్ అయిన ఆల్ టైమ్ రికార్డులను చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.;

Update: 2025-10-30 07:38 GMT

సినిమా సక్సెస్‌ను కొలవడానికి వందల కోట్లు అనేది ఒక లెక్క మాత్రమే. కానీ, ఒక హీరోకు ఉన్న అసలైన స్టామినా, క్రేజ్‌ను కొలవాలంటే ఫుట్‌ఫాల్స్, మొదటి రోజు ఎంత మంది టికెట్లు కొన్నారు అనేది చూడాలి. టికెట్ రేట్లు పెరిగితే కలెక్షన్లు పెరుగుతాయి, కానీ జనాలు థియేటర్‌కు రావడం అనేది హీరో స్టార్‌డమ్‌కు అసలైన మీటర్. ఈ విషయంలో, ఇండియన్ సినిమా హిస్టరీలో క్రియేట్ అయిన ఆల్ టైమ్ రికార్డులను చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.

ఈ లిస్ట్‌లో నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నది ఏ సినిమానో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'బాహుబలి 2' క్రియేట్ చేసిన రికార్డ్ అలాంటిది. మొదటి రోజు ఏకంగా 1.05 కోట్ల మంది ఈ సినిమా కోసం థియేటర్లకు వచ్చారు. ఇది ఇండియన్ సినిమాలో ఎవరూ టచ్ చేయలేని రికార్డ్. ఎందుకంటే, రెండో ప్లేస్‌లో ఉన్న 'పుష్ప 2' (71 లక్షలు), 'KGF 2' (70 లక్షలు) సినిమాలకూ, 'బాహుబలి 2'కూ మధ్య దాదాపు 30 లక్షలకు పైగా ఫుట్‌ఫాల్స్ గ్యాప్ ఉంది.

ఈ లిస్ట్ చూస్తే ఇంకో విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. ఇది ఇండియన్ సినిమా లిస్ట్ కంటే, 'సౌత్ సినిమా' లిస్ట్‌లా కనిపిస్తోంది. టాప్ 8 సినిమాల్లో ఏకంగా 7 సినిమాలు సౌత్ ఇండస్ట్రీలవే కావడం విశేషం. పుష్ప 2, KGF 2, RRR, సలార్, కల్కి, ఆదిపురుష్, సాహో.. ఇలా టాప్ ప్లేసులన్నీ సౌత్ హీరోలవే.

అన్నింటికంటే ముఖ్యంగా, ఈ లిస్ట్‌లో 'కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్' ఎవరంటే రెబల్ స్టార్ ప్రభాస్. టాప్ 12 లిస్ట్‌లో ఏకంగా 5 సినిమాలు ప్రభాస్‌వే ఉన్నాయి. ఇది ఆయన స్టామినాకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.

టాప్ లిస్ట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

బాహుబలి 2: 1.05 కోట్లు

పుష్ప 2 ది రూల్ 71: లక్షలు

KGF 2: 70 లక్షలు

RRR: 58 లక్షలు

సలార్: 52 లక్షలు

కల్కి 2898 AD: 51 లక్షలు

ఆదిపురుష్: 48 లక్షలు

సాహో: 48 లక్షలు

జవాన్: 45 లక్షలు

ప్రేమ్ రతన్ ధన్ పాయో: 45 లక్షలు

లియో: 44 లక్షలు

దేవర: 42 లక్షలు

ఈ లిస్ట్‌లో ప్రభాస్ దండయాత్ర చూడొచ్చు. 'బాహుబలి 2' (1), 'సలార్' (5), 'కల్కి 2898 AD' (6) లాంటి బ్లాక్‌బస్టర్లతో పాటు, 'ఆదిపురుష్' (7), 'సాహో' (8) లాంటి యావరేజ్, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఓపెనింగ్ ఫుట్‌ఫాల్స్‌లో టాప్ 10లో ఉన్నాయి. అంటే, సినిమా టాక్‌తో సంబంధం లేకుండా, కేవలం ప్రభాస్ పేరు మీదే మొదటి రోజు జనాలను థియేటర్లకు రప్పించడంలో ఆయనకు సాటిలేరని ఈ నంబర్స్ ప్రూవ్ చేస్తున్నాయి.

బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ 'జవాన్', సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' మాత్రమే ఈ లిస్ట్‌లో టాప్ 10లో నిలిచాయి. తమిళం నుంచి 'లియో', తెలుగు నుంచి 'దేవర' కూడా లిస్ట్‌లో ఉన్నా, టాప్ 8లో 5 సినిమాలు ప్రభాస్‌వే కావడం మాత్రం ఆయన కటౌట్‌కు ఉన్న పవర్‌ను చూపిస్తోంది. కలెక్షన్లు వస్తాయి పోతాయి, కానీ ఈ ఫుట్‌ఫాల్స్ రికార్డులే అసలైన స్టామినాకు సింబల్.

Tags:    

Similar News