గిన్నిస్ రికార్డ్: పారాచూట్ నుంచి 16 సార్లు దూకిన స్టార్ హీరో
టామ్ క్రూజ్ 'మిషన్: ఇంపాజిబుల్ ' స్టంట్స్ తో సరి కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పాడు.;
గాల్లో విమానం లోంచి జంప్ చేయడం, విమానం రెక్కలు పట్టుకుని గాల్లో తేలుతూ పోరాటాలు చేయడం..ఒక చాపర్ నుంచి ఇంకో చాపర్ లోకి జంప్ చేయడం.. గాల్లోనే పారా చూట్ మండిపోయినా సేఫ్ ల్యాండ్ అవ్వడం.. ఇవన్నీ థియేటర్లలో చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి కానీ, అలాంటి డేరింగ్ ఫీట్స్ వేయాలంటే గట్స్ ఉండాలి. ఇలాంటి విద్యల్లో గిన్నిస్ రికార్డ్ అందుకున్నాడు టామ్ క్రూజ్.
టామ్ క్రూజ్ 'మిషన్: ఇంపాజిబుల్ ' స్టంట్స్ తో సరి కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పాడు. సాహసోపేతమైన స్టంట్‌లను చేయడంలో వెనకాడని సాహసి టామ్ అత్యధికంగా మండే(అగ్నితో) పారాచూట్ జంప్‌లలో రికార్డును సృష్టించాడు. ఇటీవల విడుదలైన 'మిషన్: ఇంపాజిబుల్ - ది ఫైనల్ రికనింగ్' కోసం అతడు 16 సార్లు జంప్ చేసి ఈ కొత్త రికార్డు సృష్టించాడు.
టామ్ క్రూజ్ ఈథన్ హంట్ 1940లలో రూపొందించిన రెండు బైప్లేన్‌లపై గాబ్రియేల్‌తో పోరాడుతాడు. చివరగా, ఈథన్ విమానం మంటల్లో చిక్కుకోవడంతో దాని నుండి దూకేస్తాడు. అతడి పారాచూట్ కూడా మంటల్లో చిక్కుకుందని గ్రహిస్తాడు. ఈ సన్నివేశం 'ది ఫైనల్ రెక్కానింగ్' హెడ్ లైన్స్ లో ఒకటి.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. టామ్ క్రూజ్ ..హెలికాప్టర్ నుండి 16 సార్లు దూకడమే కాదు.. ఇంధనం మండటం వల్ల తగలబడిన పారా చూట్ తో ప్రమాదంలో చిక్కుకుంటాడు. ఒక సన్నివేశంలో కాలిపోయిన పారాచూట్ ని కత్తిరించి బ్యాకప్‌ను సురక్షితంగా అమర్చాడు. మరే ఇతర నటుడు లేదా స్టంట్‌మ్యాన్ ఇలా చావు అంచుల వరకూ వెళ్లలేదు! అని గిన్నిస్ రికార్డ్స్ ఆఫ్ బుక్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇది టామ్ క్రూజ్ రెండవ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. హాలీవుడ్ సూపర్‌స్టార్ టామ్ 2012, 2015 మధ్య తన 11 చిత్రాలకు వరుసగా అత్యధికంగా 100 మిలియన్ల డాలర్లు వసూళ్లు చేసిన నటుడిగా రికార్డును సృష్టించాడు. మిషన్: ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్ మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై 389.5 మిలియన్ డాలర్లు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం మిషన్: ఇంపాజిబుల్ ఫ్రాంచైజీలో చివరి మూవీగా చెబుతున్నారు.