• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మన హీరోలు...

మన హీరోలు మారిపోతున్నారు.. ఏదైనా సినిమా కోసమే..

| ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేసేవారు. సినిమా స్టోరీ మారిన హీరో లుక్ మాత్రం మారేది కాదు

By - Tupaki Desk
Update: 2024-07-01 09:30 GMT

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేసేవారు. సినిమా స్టోరీ మారిన హీరో లుక్ మాత్రం మారేది కాదు. ఒక వేళ మార్చాల్సి వస్తే మ్యాకప్ తో మ్యానేజ్ చేసేవారు తప్ప క్యారెక్టర్ కి తగ్గట్లుగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యేవారు కాదు. అలాగే కొన్ని సినిమాలలో హెయిర్ స్టైల్ మారుస్తూ ఉండేవారు. లుక్ మాత్రం ఒకేరీతిలో ఉండేది. గతంలో చిరంజీవి కొన్ని ప్రయోగాలు చేసినపుడు లుక్ చేంజ్ చేస్తూ ఉండేవారు. అయితే మెగాస్టార్ గా కమర్షియల్ ఇమేజ్ వచ్చిన తర్వాత అతని నుంచి పెద్ద చేంజ్ కనిపించలేదు.

హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ తో క్యారెక్టరైజేషన్ ని మన హీరోలు మేగ్జిమమ్ మ్యానేజ్ చేసేవారు. అయితే ఇప్పుడు స్టార్ హీరోల ఆలోచనలు మారాయి. తమిళంలో యూనివర్శల్ యాక్టర్ కమల్ హాసన్ క్యారెక్టర్ కి తగ్గట్లుగా తన లుక్ మార్చుకుంటూ ఉండేవారు. ఎక్కువగా తన బాడీ మీద తాను ప్రయోగాలు చేసుకునేవారు. తరువాత చియాన్ విక్రమ్ అయితే అవసరాన్ని బట్టి లావు కావడం, లేదంటే తగ్గడం చేస్తూ పెర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్ కోసం తనని తాను మార్చుకునేవారు. ఇప్పుడు ఈ అలవాటు తెలుగు హీరోలకి కూడా వచ్చింది.

పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ ఫుల్ గా గెడ్డం పెంచడంతో పాటు జబ్బని పైకి పెట్టి పుష్పరాజ్ క్యారెక్టర్ ని కొత్తగా ట్రై చేశాడు. బాడీ లాంగ్వేజ్ కూడా పూర్తిగా మార్చుకున్నారు. కల్కి మూవీ కోసం ప్రభాస్ తన లుక్ మార్చుకున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం స్లిమ్ కాబోతున్నాడంట. దీనికోసం రెండు నెలల పాటు ప్రభాస్ వర్క్ అవుట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో ఐపీఎస్ ఆఫీసర్ పాత్ర కోసం పెర్ఫెక్ట్ బాడీ మెయింటేన్ చేస్తూ వస్తున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC16 తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం స్లిమ్ అయ్యి స్పోర్ట్ మెన్ గా మారబోతున్నాడంట. నెలరోజుల పాటు ఈ క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉత్తరాంధ్ర నేటివిటీకి తగ్గట్లుగా లుక్, హెయిర్ స్టైల్, డైలాగ్ డిక్షన్ మార్చుకోవడానికి చరణ్ సిద్ధం అయ్యాడంట. అలాగే తారక్ ప్రతి సినిమాకి లుక్ పరంగా వేరియేషన్ ఉండేలా చూసుకుంటున్నారు.

ప్రస్తుతం దేవర మూవీలో క్యారెక్టర్ కోసం రఫ్ లుక్ లోకి మారాడు. వార్ 2లో చేయబోయే ఆఫీసర్ క్యారెక్టర్ లో స్టైలిష్ గా కనిపించబోతున్నాడంట. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ కోసం మాస్ అవతార్ లోకి మారబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం తారక్ ప్రత్యేకంగా రెడీ అవ్వనున్నాడంట. అలాగే ఎప్పుడు ఒకే లుక్ మెయింటేన్ చేసే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రాజమౌళితో చేయబోతున్న సినిమా కోసం కండలు పెంచాడు. మొదటిసారి డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడంట. ప్రస్తుతం ఈ మూవీకి సంబందించిన లుక్ టెస్ట్ జరుగుతుందని తెలుస్తోంది.

Tags:    
  • Tollywoodheroes 
  • Alluarjun 
  • Pushpa2 
  • Devara 
  • NTR 
  • Gamechanger 
  • Ramchanger 
  • Herolooks 
  • Teluguheroes 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS