• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్.. కథలు కథలుగా...

టాలీవుడ్.. కథలు కథలుగా చెప్పాలని..

| పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ నటించిన స‌లార్‌ కూడా రెండు భాగాలుగా రాబోతున్నట్లు ఇప్పటికే మేక‌ర్స్ అనౌన్స్ చేశారు

By - Tupaki Desk
Update: 2023-10-05 06:00 GMT

ప్రస్తుతం ఓ కథను రెండు భాగాలుగా చెప్పడంపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు దర్శకనిర్మాతలు. పాన్‌ ఇండియా సినిమాలన్నీ చాలా వరకు రెండు భాగాలుగానే ప్రేక్షకుల ముందుకొస్తూ అలరిస్తున్నాయి. మొదటి భాగం కథతో ఆసక్తిని రేకెత్తించి, రెండో భాగం కోసం ఆత్రుతగా ఎదురు చూసేలా చేస్తున్నాయి. అయితే తాజాగా ఆ జాబితాలో ఎన్టీఆర్ దేవర కూడా చేరిన సంగతి తెలిసిందే.

అయితే ఇలా రెండు భాగాలుగా కథలు చెప్పడమనే ట్రెండ్ మొదలైంది బాహుబలితోనే. ఆ తర్వాత కేజీయఫ్ కూడా అదే బాటను ఫాలో అయి కమర్షియల్ గా బిగ్ సక్సెస్​ను అందుకుంది. ఇంకా ఈ బాటలో ఇప్పుడు చాలానే చిత్రాలు తెరకెక్కుతున్నాయి. పుష్ప మొదటి భాగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. రెండో భాగం కోసం ఆత్రుతగా ఎదురుచూసేలా చేసింది. ఇది మేకింగ్ దశలో ఉంది.

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ నటించిన స‌లార్‌ కూడా రెండు భాగాలుగా రాబోతున్నట్లు ఇప్పటికే మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. మొదటి భాగాన్ని సీజ్‌ఫైర్ పేరుతో ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేస్తున్నారు. ప్ర‌భాస్ నటిస్తున్న మరో చిత్రం క‌ల్కి కూడా రెండు లేదా మూడు భాగాలుగా రావొచ్చ‌న్న మాటలు వినిపిస్తున్నాయి.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ క‌ళ్యాణ్ నటిస్తున్న సినిమాలు కూడా రెండు భాగాలుగా తీసుకొచ్చే ఆలోచ‌న‌తో మేక‌ర్స్ ఉన్నార‌ని తెలుస్తోంది. వీటిలో గ్యాంగ్ స్టర్ యాక్షన్ ఎంటర్​టైనర్​ ఓజీ ఒక‌టి కాగా.. మరోకటి హిస్టారికల్ డ్రామా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. ఈ రెండు చిత్రాలను రెండు భాగాలుగానే తీసుకొస్తారని అంటున్నారు.

ఇక గౌత‌మ్ తిన్న‌నూరి - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబో సినిమా కూడా రెండు భాగాలుగా రానుందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాలే కాకుండా.. టాలీవుడ్​లో ప్రస్తుతం మరిన్ని సీక్వెల్స్ కూడా తెరకెక్కుతున్నాయి. టిల్లు స్క్వేర్​, గూఢ‌చారి 2, డబుల్ ఇస్మార్ట్ సినిమాల‌ కూడా సీక్వెల్స్​గానే రాబోతున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇంకా అఖండ‌, స్కంద వంటి సినిమాల‌కు కూడా సీక్వెల్స్ ఉన్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Tags:    
  • Tollywood 
  • Devaramovie 
  • NTR 
  • Prabhas 
  • Salaarmovie 
  • KGFmovie 
  • Yash 
  • Bahubalimovie 
  • OGmovie 
  • Pawankalyan 
  • Pushpamovie 
  • Alluarjun 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS