ముగింపు వేళ గ్రాండ్ గా ముగించేది ఎవరు?
2025 ఏడాదికి మరో పదిహేను రోజుల్లో గుడ్ బై చెప్పబోతున్నాం. 12 నెలల కాలాన్ని ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలతో ముగించబోతున్నాం.;
2025 ఏడాదికి మరో పదిహేను రోజుల్లో గుడ్ బై చెప్పబోతున్నాం. 12 నెలల కాలాన్ని ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలతో ముగించబోతున్నాం. మరి ఏడాది ముగింపు వేళ టాలీవుడ్ నుంచి ఎలాంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. డిసెంబర్ 19, 26 శుక్రవారాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఈ రెండు శుక్రవారాల్లోనే ఏకంగా 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 'శకుటుంబానాం', 'గుర్రం పాపిరెడ్డి' లాంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. కామెడీ ప్రధానాంశంగా తెరకెక్కిన చిత్రాలివి. 'శకుటుంబానాం' లో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య , రచ్చ రవి లాంటి కామెడీ ఆర్టిస్టులున్నారు.
వాటన్నింటిలో 'అవతార్ 3' హైలైట్:
హీరో, హీరోయిన్లు ఇద్దరు కొత్తవాళ్లు. సీనియర్ నటుడు శుభలేక సుధాకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 'గుర్రం పాపి రెడ్డి'లో కూడా దాదాపు అందరూ కొత్త వాళ్లే. కామెడీ ప్రధానంగా సాగేత చిత్రమిది. ఇదే శుక్రవారం ప్రపంచాన్ని శాశించడానికి భారీ అంచనాల మధ్య 'అవతార్ 2 ది ఫైర్ అండ్ యాష్' కూడా రిలీజ్ అవుతుంది. ఈ హాలీవుడ్ సినిమా తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. హాలీవుడ్ సినిమా? భారత దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రమిది. ప్రత్యేకించి తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా? అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
అంచనాలన్నీ అవతార్ 3 పైనే:
మిగతా భాషలకంటే సినిమా అనే అభిమానం తెలుగులో ఎక్కువగా కనిపిస్తుంది. అసలే స్టార్ హీరోల సినిమాలు లేక ఎంటర్ టైన్ మెంట్ మిస్ అవుతోన్నవారంతా? 'అవతార్ 3' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన ఓ పాన్ ఇండియా సినిమా కూడా అంచనాలు అందుకోవడంలో విఫలమవ్వడంతో? ప్రేక్షకులంతా 'అవతార్ 3'పైనే పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో `అవతార్ 3` ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక వసూళ్లు సాధిస్తుందని అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి.
ముగింపు వేళ ఎవరు హైలైట్:
ఇక చివరి శుక్రవారం డిసెంబర్ 25న మాత్రం ఏకంగా ఏడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. శ్రీకాంత్ తనడయు నటిస్తోన్న 'ఛాంపియన్' రిలీజ్ అవుతుంది. అలాగే యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తోన్న 'షంబాల' మోస్తారు అంచనాలతో రిలీజ్ అవుతుంది. ఓ కొత్త కాన్సెప్ట్ ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమిది. ఆది కెరీర్ పరంగా సరైన కంబ్యాక్ చిత్రంగా 'షంబాలా'ని భావిస్తున్నాడు. 'పతంగ్', 'ఈషా' అనే మరో రెండు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. 'దండోరా' అనే చిత్రం కూడా రిలీజ్ అవుతుంది. 'బలగం' తరహా కాన్సెప్ట్ కావడంతో? సినిమాపై మోస్తారు అంచనా లున్నాయి. 'వృషభ', 'మార్క్' అనే ఇతర భాషల చిత్రాలు అనువాదంగా రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ పది సినిమాల్లో గ్రాండ్ విక్టరీని నమోదు చేసేది ఏ చిత్రమో చూద్దాం.