రాజాసాబ్ నిర్మాతకు నిరసన సెగ... కార్మికుల స్ట్రాంగ్ వార్నింగ్

ఇదిలా ఉండగా.. కార్మికులు సమ్మె వల్ల ఇప్పటికే ప్రొడ్యూసర్లకు రూ.1.5 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని రాజాసాబ్ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ కోర్టు కెక్కారు.;

Update: 2025-08-09 10:40 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో కార్మికుల సమ్మె నడుస్తోంది. డైలీ వేతనాలు పెంచాలని కార్మికులు కొన్ని రోజులుగా షూటింగ్ లు ఆపేసి.. సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు 24 క్రాఫ్ట్ల్స్ యూనియన్లు మద్దుతు ఇచ్చాయి. అటు ప్రొడ్యూసర్లు కూడా ఇప్పటికే పలుమార్లు సమావేశం అయ్యారు. ప్రస్తుతం ఉన్న వేతనాలు ఎక్కువగానే ఉన్నయని నిర్మాతలు చెబుతున్న మాట.

ఇదిలా ఉండగా.. కార్మికులు సమ్మె వల్ల ఇప్పటికే ప్రొడ్యూసర్లకు రూ.1.5 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని రాజాసాబ్ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ కోర్టు కెక్కారు. ఆయన ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్, కార్యదర్శి అమ్మిరాజు, సెక్రటరీ అలెక్స్‌ లకు లీగల్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా కార్మితులు సమ్మె విరమించి వెంటనే షూటింగ్ ల్లో పాల్గొనాలని, లేదంటే బయటి వ్యక్తులతో పని చేయించుకునేందుకు కూడా సిద్ధమేనని విశ్వప్రసాద్ తాజాగా వ్యాఖ్యానించారు.

ఆయన మాటలు ప్రస్తుతం వివాదం రేపాయి. ఇవి కార్మికులను రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. ఈ మేరకు ఆయనకు ఓక రకంగా వార్నింగ్ ఇచ్చేశారు. వేతనాలు పెంచాలని అడిగితే.. సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతు్నారని కార్మికులు విశ్వప్రసాద్ పై ఆరోపణలు చేశారు. అలాగే ఆయన వ్యాఖ్యలకు గానూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

లేకపోతే కార్మికులు తిరగబడితే ఆయన తట్టుకోలేరని, ఆయన ఇంటిని ముట్టడిస్తామి హెచ్చరించారు. అంతేకాదు ఆయన అసలు ఇండియన్ వ్యక్తి కాదని, ఇంగ్లీశ్ కల్చర్ ను ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారని మండిపడడ్డారు. సమ్మె తర్వాత కూడా ఆయన సినిమాలకు పని చేయబోమని హెచ్చరించారు.

అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో షూటింగ్ లు బంద్ అయ్యాయి. కార్మికుల సంఘాల నాయకులు, కార్యకర్తలతో ఎవరూ సంప్రదింపులు జరపకూడదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తాజాగా నిర్మాతలకు సూచనలు చేసింది. ఔట్ డోర్ షూటింగ్ లు నిలిపివేయాలని కోరింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇది అమలలో ఉంటుందని చెప్పింది. కాగా, సినీ కార్మికులు తమకు ప్రస్తుతం ఉన్న వేతనాలు సరిపోవడం లేదని.. అదనంగా 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, కార్మికుల డిమాండ్లకు నిర్మాతలు ఒప్పుకోవడం లేదు.

Tags:    

Similar News