సీఎం వద్దకు సినీ నిర్మాతలు.. ఈ విషయంలో జోక్యం చేసుకున్నందుకే
టాలీవుడ్ లో వేతన పెంపునపై కార్మికులు చేపట్టిన సమ్మెను రీసెంట్ గా విరమించారు. తెలంగాణ ప్రభుత్వం జోక్యంతో వివాదం సర్దుమనిగింది;
టాలీవుడ్ లో వేతన పెంపునపై కార్మికులు చేపట్టిన సమ్మెను రీసెంట్ గా విరమించారు. తెలంగాణ ప్రభుత్వం జోక్యంతో వివాదం సర్దుమనిగింది. అంతకుముందు పలుమార్లు నిర్మాతలు- కార్మిక సంఘాల నాయకులు చర్చించినప్పటికీ ఫలితం రాలేదు. ఆ చర్చలన్నీ విఫలమయ్యాయి. అందుకే ఈ వ్యవహారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని అటు నిర్మాతలు- ఇటు కార్మికులకు నచ్చ జెప్పి రాజీ కుదిర్చారు.
దీంతో టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు సైతం శుక్రవారమే ప్రారంభం అయ్యియి. యాథావిథిగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అయితే దాదాపు మూడు వారాలు కొనసాగిన సమ్మె వల్ల నిర్మాతలకు జరుగుతున్న నష్టాన్ని తెలంగాణ ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించింది. దీంతో ఇండస్ట్రీలోని నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే తమకు- కార్మికుల మధ్య నెలకొన్న వివాదాన్ని ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించడంతో నిర్మాతలు సీఎంను కలవడానికి నిర్ణయించుకున్నారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ నిర్మాతలు మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలుపనున్నారు.
కాగా, టాలీవుడ్ కార్మికులు తమ వేతనాన్ని పెంచాలన్న డిమాండ్ తో ఇటీవల సమ్మె చేపట్టారు. 24 క్రాఫ్ట్స్ లోని అందరు కార్మికులు షూటింగ్ లు బాయ్ కట్ చేసి సమ్మెలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు- కార్మిక సంఘాల నాయకుల మధ్య పరుమార్లు చర్చలు జరిగాయి. అయితే నిర్మాతలు వేతనాల పెంపునకు ఒప్పుకున్నా.. వాళ్లు పెట్టిన షరతులకు కార్మికులు ఒప్పుకోలేదు. దీంతో సమ్మె అలాగే కొనసాగింది.
ఈ పరిణామాలతో చిత్ర పరిశ్రమలో షూటింగ్ లు నిలిచిపోయాయి. ఏకంగా ఈ వ్యవహారం మెగాస్టార్ చిరంజీవి వద్దకు కూడా వెళ్లింది. ఆయన స్వయంగా కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడారు. ఈ సమస్య త్వరలోనే పరిస్కారం కావాలని ఆశించారు. నిర్మాతలు కార్మికలకు వ్యతిరేకం కాదని నిర్మాతలు చెప్పినప్పటికీ.. కార్మికులు పలు షరతులకు అందీకరించలేదు.
దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్ ఫెడరేషన్ తో పాటు కార్మిక సంఘాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. కార్మికులకు పలు దఫాల్లో వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం నిర్మాతలను ఒప్పించింది. దీంతో సమ్మెకు తెర పడింది. ఈ క్రమంలో కార్మికులకు దశల వారీగా మూడేళ్లలో 22.5 శాతం వేతనాలు పెంచడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. మొదటి ఏడాది 15 శాతం, రెండవ ఏడాది 2.5 శాతం, మూడవ ఏడాది 5 శాతం వేతనాలు పెరగనున్నాయి.