సీనియర్ వర్సెస్ యంగ్ స్టార్స్ - హీరోయిన్ల కొరత సమస్య!
ప్రస్తుతం సౌత్ - నార్త్ అనే తేడా లేకుండా సీనియర్ హీరోల సినిమాల్లో నయనతార, తమన్నా, త్రిష వంటి సీనియర్ నటీమణులు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ సమీకరణాలు ఊహించని రీతిలో మారుతున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోలకు సరైన జోడీలు దొరకడం లేదనే ఫిర్యాదులు ఎక్కువగా వినిపించేవి. అయితే ఇప్పుడు సీనియర్ స్టార్ల విషయంలో ఆ సమస్య తీరుతున్నా? టైర్-1 స్టార్ హీరోల సరసన కథానాయికలను ఎంపిక చేయడం దర్శక నిర్మాతలకు పెద్ద సవాలుగా మారుతోంది. కొత్త ప్రాజెక్ట్‌లు పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నా? హీరోయిన్ల ఫైనలైజేషన్ దగ్గరే క్యాస్టింగ్ ప్రక్రియ నిలిచిపోతోంది.
ప్రస్తుతం సౌత్ - నార్త్ అనే తేడా లేకుండా సీనియర్ హీరోల సినిమాల్లో నయనతార, తమన్నా, త్రిష వంటి సీనియర్ నటీమణులు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అద్భుతమైన గ్లామర్, నటనతో అలరిస్తున్న భామలు స్టార్ హీరోలకు పర్‌ఫెక్ట్ జోడీగా మారుతున్నారు. వీరి కాల్ షీట్లు బిజీగా ఉండటంతో పాటు, సీనియర్ స్టార్ల చిత్రాలకు సరైన నిలకడైన ఆప్షన్లుగా నిలుస్తున్నారు. అయితే అసలు సమస్య అంతా పాన్-ఇండియా స్టార్ హీరోల ప్రాజెక్ట్‌ల వద్దే ఎదురవుతోంది. గ్లోబల్ రీచ్ ఉన్న ఈ హీరోల పక్కన నటించడానికి గ్లామర్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ తెచ్చే నటీమణులు కావాల్సి వస్తోంది.
ఈ క్రమంలో నార్త్ భామల వైపు చూస్తున్నా? వారి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం .. కాంబినేషన్ సెట్ కాకపోవడం మేకర్స్‌కు తలనొప్పిగా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ మైథలాజికల్ మూవీ కోసం కథానాయికగా కియారా అద్వానీ పేరు పరిశీలనలో ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ముద్ర పడలేదు. అలాగే రామ్ చరణ్ - సుకుమార్ (RC17) క్రేజీ కాంబినేషన్ ప్రాజెక్ట్ కోసం కృతి సనన్, రుక్మిణి వసంత్, సారా అర్జున్ వంటి పలువురు భామల పేర్లు తెరపైకి వచ్చినా? ఇప్పటివరకు ఎవరినీ ఫైనల్ చేయలేకపోయారు.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం పాన్-ఇండియా సినిమాల టైట్ షూటింగ్ షెడ్యూల్స్ ..నటీమణుల ఎంపికలో ప్రొడ్యూసర్లు పాటిస్తున్న మార్కెట్ ప్రాధాన్యతలే. సౌత్ నుండి కొత్త నటీనటులు వస్తున్నా? అగ్ర హీరోల సరసన నటించేందుకు అవసరమైన స్టార్‌డమ్ .. ఇమేజ్ ఉన్న హీరోయిన్లు వేళ్లపై లెక్కపెట్టే స్థాయిలోనే ఉన్నారు. దీంతో ఒకే రకమైన ఆప్షన్ల చుట్టూ ఇండస్ట్రీ తిరగాల్సి వస్తోంది.
మొత్తానికి సీనియర్ నటీమణులు హవా కొనసాగిస్తూ సీనియర్ హీరోల ప్రాజెక్ట్‌లను నడిపిస్తుంటే.. యంగ్ స్టార్ల సరసన హీరోయిన్ల వేట మాత్రం దర్శక నిర్మాతలకు పరీక్షగా మారింది. రాబోయే రోజుల్లో భారీ ప్రాజెక్ట్‌లు ఎలాంటి కొత్త కాంబినేషన్లను పరిచయం చేస్తాయో ? హీరోయిన్ల కొరత సమస్యకు ఎలాంటి ?పరిష్కారం దొరుకుతుందో చూడాలి.