టాప్ స్టార్ల నెక్స్ట్ లైన్: హైప్ సరే.. గ్రౌండ్ లెక్కలు ఎలా ఉన్నాయి?
టాలీవుడ్ టాప్ హీరోల లైనప్ చూస్తే సినిమాలకు కొదవ లేదు. ఒక ప్రాజెక్ట్ సెట్స్‌పై ఉండగానే మరో రెండు కాంబినేషన్లు లైన్‌లోకి వస్తున్నాయి.
టాలీవుడ్ టాప్ హీరోల లైనప్ చూస్తే సినిమాలకు కొదవ లేదు. ఒక ప్రాజెక్ట్ సెట్స్‌పై ఉండగానే మరో రెండు కాంబినేషన్లు లైన్‌లోకి వస్తున్నాయి. అభిమానులకు ఇది హైప్ ఇచ్చే విషయమే. కానీ ఒక్కో సినిమా భారీ స్కేల్‌కు వెళ్లిపోతున్న సమయంలో ఈ కమిట్‌మెంట్స్ అన్నీ అనుకున్న టైమ్‌కు పూర్తవుతాయా అన్నదే అసలు లెక్క. ఇప్పుడు టాప్ లీగ్‌లో చాలామంది హీరోల దగ్గర ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రభాస్ అయితే మరింత బిజీ. ‘ఫౌజి’ డిసెంబర్ 3 రిలీజ్ కోసం ముందుకు వెళ్తుండగా, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ కూడా జరుగుతోంది. వీటి వెనక నాగ్ అశ్విన్ ‘కల్కి 2’ ఎదురుచూస్తోంది. ఆ సినిమాకు ఇప్పటివరకు పది రోజుల షూటింగ్ మాత్రమే జరిగిందని దర్శకుడే చెప్పారు. ప్రభాస్ ఖాళీ అయిన తర్వాతే పెద్ద షెడ్యూల్ మొదలవుతుందని చెప్పడంతో, స్టార్ డేట్స్ కోసం ఎంత పెద్ద సినిమా అయినా ఆగాల్సిందే అని అర్థమవుతుంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మీదే ఫోకస్ పెట్టాల్సి ఉంది. భుజం గాయం, ఆ తర్వాత సర్జరీ కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. మరో రెండు వారాల్లో మళ్లీ షూట్ మొదలుపెట్టి, ఫిబ్రవరిలోపు పూర్తి చేయాలని నిర్మాతలు చెబుతున్నారు. 2027 జూన్ 11 రిలీజ్ డేట్‌ను మాత్రం అలాగే ఉంచారు. అంటే ఇక్కడ సమస్య కొత్త కమిట్‌మెంట్ కాదు, ఇప్పటికే ప్రకటించిన డేట్‌కు తగ్గట్టుగా షూటింగ్ ఫినిష్ చేయాలి.
రామ్ చరణ్ దగ్గర లెక్క మరోలా ఉంది. ‘పెద్ది’ తర్వాత సుకుమార్ సినిమా సిద్ధంగా ఉన్నా, మణికట్టు సర్జరీ తర్వాత ఆయన రికవరీలో ఉన్నారు. మెడికల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘రంగస్థలం’ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కానీ టైటిల్, ఫస్ట్ లుక్ కంటే ముందు చరణ్ పూర్తి స్థాయిలో షూటింగ్‌కు ఎప్పుడు వస్తారన్నదే అసలు డౌట్.
అల్లు అర్జున్ అట్లీ ‘రాకా’తో బిజీగా ఉన్నాడు. ముంబైలో ఒక కీలక షెడ్యూల్ కూడా పూర్తైంది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా, ఆపై బాసిల్ జోసెఫ్ ప్రాజెక్ట్ లైన్‌లో ఉన్నాయి. మహేష్ బాబు దగ్గర పరిస్థితి వేరుగా ఉంది. వరుస అనౌన్స్‌మెంట్లు లేకపోయినా, రాజమౌళి ‘వారణాసి’ ఒక్కటే పెద్ద క్యాలెండర్ తీసుకుంటోంది. ఇంకా ఈ సినిమా షూట్ 2 నెలల వరకు కొనసాగనుంది.
ఇక్కడ మరో ఛాలెంజ్ రిలీజ్ విండో దగ్గర మొదలవుతోంది. ఒక పెద్ద సినిమా రెండు నెలలు వెనక్కి వెళ్లినా, అదే సీజన్ కోసం ప్లాన్ చేసిన మరో స్టార్ సినిమా డేట్ మార్చుకోవాల్సి రావచ్చు. అందుకే షూటింగ్ ఎంతవరకు వచ్చింది, పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎంత టైమ్ కావాలి, ఏ సీజన్ ఖాళీగా ఉంది అన్న లెక్కలు కలిసి రావాలి. టాప్ హీరోల లైనప్ పెరుగుతున్న కొద్దీ, సరైన రిలీజ్ డేట్ దొరకడం కూడా మేకర్స్‌కు మరో టాస్క్ గా మారుతోంది. ముఖ్యంగా పండగ సీజన్లలో ఈ పోటీ మరింత రిస్కీగా ఉంటుంది.