థియేట‌ర్ల బంద్ అంత ఈజీ కాదు!

ఎగ్జిబిట‌ర్ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌బోతున్నారు. ఈ మీటింగ్‌లో ఎగ్జిబిట‌ర్లు డిమాండ్ చేస్తున్న‌ట్టే ఫ‌స్ట్ వీక్ లాభాల్లో వాటాని కేటాయిస్తారా? ల‌ఏదా అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.;

Update: 2025-05-21 07:07 GMT

ఓటీటీల ప్ర‌భావం మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి దేశంలో థియేట‌ర్ల వ్య‌వ‌స్థ క్ర‌మ క్ర‌మంగా కుదేల‌వుతూ వ‌స్తోంది. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డానికి ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డం, స్టార్లె రెండేళ్ల‌కో సినిమా చేయ‌డం, థియేట‌ర్ టికెట్ రేట్లు సామాన్యుడికి అంద‌ని స్థాయికి పెరిగిపోవ‌డంతో దేశంలో థియేట‌ర్ల వ్య‌వ‌స్థ ప్ర‌శ్నార్ధ‌కంలో ప‌డిపోయింది. మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌లో ఫుడ్ విష‌యంలోనూ బాదుడు మ‌రీ ఎక్కువ కావ‌డం కూడా మ‌రో కార‌ణం. దీంతో ప్రేక్ష‌కుల మునుప‌టిలా థియేట‌ర్ల‌కు రావాలంటే భ‌య‌ప‌డుతున్నారు.

ఈ కార‌ణంగా థియేట‌ర్ల నిర్వ‌హ‌ణ క‌ష్ట‌త‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే రెంట్ సిస్టంను ప‌క్క‌న పెట్టి లాభాల్లో వాటాని కోరుతూ ఆంధ్ర‌- తెలంగాణ ఎగ్జిబిట‌ర్లు ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌డిది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జూన్ 1 నుంచి ఎగ్జిబిట‌ర్లు థియేట‌ర్ల బంద్‌కు సిద్ధ‌మ‌వుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. థియేట‌ర్ల బంద్‌కు ఎగ్జిబిట‌ర్లు పిలుపునివ్వ‌డంతో బుధవారం సాయంత్రం సినీ నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు అత్య‌వ‌స‌రంగా స‌మావేశం కాబోతున్నారు.

ఎగ్జిబిట‌ర్ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌బోతున్నారు. ఈ మీటింగ్‌లో ఎగ్జిబిట‌ర్లు డిమాండ్ చేస్తున్న‌ట్టే ఫ‌స్ట్ వీక్ లాభాల్లో వాటాని కేటాయిస్తారా? ల‌ఏదా అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం థియేట‌ర్ల బంద్ ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అనే వాద‌న మ‌రో ప‌క్క వినిపిస్తోంది. ఈ స‌మ్మ‌ర్ పెద్ద చిత్రాలు రిలీజ్ కాక‌పోవ‌డంతో ఇండ‌స్ట్రీ ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. స‌మ్మ‌ర్ సీజ‌న్ వేస్ట్ అయిపోవ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి జూన్‌పై ప‌డింది. ఈ నెల‌లోనే థ‌గ్ లైఫ్‌, హ‌రి హర వీర‌మ‌ల్లు, కుబేర‌, క‌న్న‌ప్ప వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

ఈ నేప‌థ్యంలో థియేట‌ర్ల బంద్ అంత ఈజీ కాదు అనే ప‌లువురు కామెంట్ చేస్తున్నారు. అంతే కాకుండా గ‌త కొంత కాలంగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' ఇదే నెల‌లో రిలీజ్ అవుతోంది. ఇది ప‌వ‌న్‌కు, ఏ.ఎం.ర‌త్నంకు అత్యంత కీల‌కం. జూన్ 12న విడుద‌ల కానున్న ఈ మూవీని భారీగా రిలీజ్ చేయాల‌ని ఇప్ప‌టికే ఏర్పాట్లు చేస్తున్నారు. ప‌వ‌న్ న‌టించిన తొలి పాన్ ఇండియా సినిమా కావ‌డంతో ఈ ప్రాజెక్ట్ మేక‌ర్స్‌కి, ప‌వ‌న్‌కు అత్యంత కీల‌కంగా మారింది. ప‌వ‌న్ ప్ర‌స్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్ంన ఈ స‌మ‌యంలో ఎగ్జిబిర్లు థియేట‌ర్ల‌ని మూసి వేయ‌డం కుద‌ర‌ని ప‌ని. దీంతో ఈ బుధ‌వారం జ‌రిగే చ‌ర్చ‌ల్లో కీల‌క అప్ డేట్ రావ‌డం ఖాయ‌మ‌ని, థియేట‌ర్ల బంద్ అనే మాటే ఉండ‌ద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News