టాలీవుడ్ మాస్ ని రౌండ‌ప్ చేసిన బాలీవుడ్!

టాలీవుడ్ ని బాలీవుడ్ రౌండ‌ప్ చేస్తోందా? టాలీవుడ్ ట్యాలెంట్ కి బాలీవుడ్ సెల్యూట్ చేస్తుందా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది.;

Update: 2025-04-08 05:39 GMT

టాలీవుడ్ ని బాలీవుడ్ రౌండ‌ప్ చేస్తోందా? టాలీవుడ్ ట్యాలెంట్ కి బాలీవుడ్ సెల్యూట్ చేస్తుందా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే చాలా తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అయిన సంద ర్భాలున్నాయి. హిట్ అయిన క‌మ‌ర్శియ‌ల్ చిత్రాలు కొన్ని హిందీలోనూ రీమేక్ రూపంలో మంచి లాభాలు తెచ్చి పెట్టాయి. ఇక పాన్ ఇండియాలో తెలుగు సినిమా స‌త్తా చాటిన త‌ర్వాత స‌న్నివేశం పూర్తిగా మారిన సంగ‌తి తెలిసిందే.

తెలుగు హీరోల‌తో క‌లిసి న‌టించాల‌ని హిందీ హీరోలు కూడా ముందుకొస్తున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ క్యూలో చాలా మంది హీరోలున్నారు. తాజాగా బాలీవుడ్ సూప‌ర్ స్టార్లు అంతా టాలీవుడ్ మాస్ డైరెక్ట‌ర్ల‌ను టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. ఒక‌ప్పుడు టాలీవుడ్ ని ఊపిన మాస్ కంటెట్ కోసం బాలీవుడ్ స్టార్లు ఇప్పుడు పోటీ ప‌డుతున్న స‌న్నివేశం క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని బాలీవుడ్ హీరో స‌న్ని డియోల్ తో మాంచి మాస్ మ‌సాల్ సినిమా `జాట్` తీస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ప‌క్కా గోపీ మార్క్ క‌మర్శియ‌ల్ చిత్ర‌మిది. వాస్త‌వానికి ఈ చిత్రాన్ని తెలుగు మాస్ హీరోతోనే గోపీ తీయాల‌ను కున్నాడు. కానీ ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేయ‌డంతో? అనూహ్యంగా బాలీవుడ్ కి వెళ్లి స‌న్ని డియోల్ ని సెట్ చేసి ప‌ట్టాలెక్కించారు. ఇప్పుడీ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు హిందీలో. ఇదే కోవ‌లో మరో మాస్ సంచ‌ల‌న హ‌రీష్ శంర్ కూడా స‌ల్మాన్ ఖాన్ లైన్ లో పెడుతున్నాడు. త‌న మార్క్ స్టోరీతో స‌ల్మాన్ ని మెప్పించాడ‌ని ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది.

అలాగే మాస్ కా బాప్ బాబి కూడా హృతిక్ రోష‌న్ కి ఓ మాస్ స్టోరీ లైన్ వినిపించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. హృతిక్ కూడా పాజిటివ్ గా స్పందించాడ‌ని వినిపిస్తోంది. మ‌రోవైపు క్లాసిక్ చిత్రాల ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కూడా మిస్ట‌ర్ ప‌ర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ కి స్టోరీ వినిపించిన‌ట్లు కొన్ని నెల‌లుగా ప్ర‌చారం జ‌రు గుతోంది. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఓ భారీ సినిమా ఉంటుంద‌ని అంటున్నారు.ఈ కాంబినేష‌న్లు గ‌నుక సెట్ అయితే? క్రేజ్ మామూలుగా ఉండ‌దు. టాలీవుడ్ రేంజ్ అంత‌కంత‌కు రెట్టింపు అయిన‌ట్లే.

Tags:    

Similar News