టాలీవుడ్ బాకీ వాటికే..ఆ బాకీ తీర్చేదెప్పుడు?
ఇన్ని విజయాలు అందుకుంటున్నా? టాలీవుడ్ ఓ విషయంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. అదే బయోపిక్స్. బాలీవుడ్‌లో బయోపిక్స్ సాధిస్తున్న విజయాన్ని చూస్తుంటే? టాలీవుడ్ ఈ విషయంలో అట్టడుగు స్థితిలో ఉందన్నది వాస్తవం.;
ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో టాలీవుడ్ ఓ వెలుగు వెలుగుతోంది. `బాహుబలి` నుండి మొదలై `ఆర్‌ఆర్‌ఆర్`, `పుష్ప`, `కల్కి` వరకూ తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. పీరియాడిక్ డ్రామాలు, సాహసోపేతమైన యాక్షన్ చిత్రాలు, సోషియో ఫాంటసీ కథలతో మన దర్శకులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇన్ని విజయాలు అందుకుంటున్నా? టాలీవుడ్ ఓ విషయంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. అదే బయోపిక్స్. బాలీవుడ్‌లో బయోపిక్స్ సాధిస్తున్న విజయాన్ని చూస్తుంటే? టాలీవుడ్ ఈ విషయంలో అట్టడుగు స్థితిలో ఉందన్నది వాస్తవం.
సాధారణంగా బయోపిక్స్ అంటే వ్యక్తి జీవిత చరిత్ర మాత్రమే కాదు. కాలానికి సంబంధించిన సామాజిక చిత్రణ కూడా. బాలీవుడ్‌లో ఎం.ఎస్. ధోని, దంగల్, సంజు వంటి చిత్రాలు భారీ వసూళ్లు సాధించడమే కాదు. ప్రేక్షకులకు గొప్ప స్ఫూర్తిని ఇచ్చాయి. తెలుగులో `మహానటి` వంటి గొప్ప బయోపిక్ వచ్చినా? ఆ తర్వాత ఆ స్థాయిలో పాన్ ఇండియా గుర్తింపు పొందిన జీవిత చరిత్రలు మన దగ్గర తక్కువగానే వచ్చాయి. ఎన్టీఆర్ జీవిత కథను ఆవిష్కరించినా అది అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. దీంతో పాన్ ఇండియాకు అంతగా కనెక్ట్ అవ్వలేకపోయింది.
అయితే ఇతర భాషల మార్కెట్‌ను, ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే బయోపిక్స్ అనేది గొప్ప ఆయుధంగా మారుతాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో పీరియాడిక్ , చారిత్రాత్మక కథల ట్రెండ్ నడుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ వాడటంలో ఇక్కడ టెక్నీషియన్లు దిట్ట అని ఇప్పటికే ప్రూవ్ అయింది. ఇదే సాంకేతికతను, మేకింగ్ స్టైల్‌ను బయోపిక్స్‌కు అన్వయిస్తే అద్భుతాలు సృష్టించొచ్చు. దేశ చరిత్రలో, క్రీడా రంగంలో లేదా విజ్ఞాన శాస్త్రంలో గొప్ప ముద్ర వేసిన తెలుగు వారి కథలు ఎన్నో ఉన్నాయి.
వాటిని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తే ఉత్తరాది మార్కెట్‌లో తెలుగు సినిమా వైభవం మరింత పెరుగుతుంది. బయోపిక్స్ తీయడం అనేది కత్తి మీద సాము లాంటిది. వాస్తవాలను వక్రీకరించకుండా సినిమాటిక్ డ్రామాను జోడించి ప్రేక్షకులను మెప్పించడం సవాలుతో కూడుకున్న పని. టాలీవుడ్ దర్శకులకు భావోద్వేగాలను పండించడంలో మంచి పట్టు ఉంది. గొప్ప వ్యక్తి జీవితంలోని సంఘర్షణను, విజయాన్ని తెలుగు తెరపై ఆవిష్కరిస్తే ఆ ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుంది. పాన్ ఇండియా మార్కెట్‌ను శాసిస్తున్న తరుణంలో కేవలం మాస్ మసాలా సినిమాలకే పరిమితం కాకుండా ఇలాంటి వైవిధ్యమైన కథలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రస్తుతం తెలుగు సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. మన స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్, దర్శకుల విజన్ తోడైతే ఓ అద్భుతమైన బయోపిక్ రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటికే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రాలు జోరందుకున్న నేపథ్యంలో అడుగుజాడలు మిగిల్చిన మహనీయుల జీవితాలను వెండితెరపైకి తీసుకురావాలి. అప్పుడే టాలీవుడ్ పూర్తిస్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను సంతృప్తి పరచగలుగుతుంది. ఇలాంటి
కథలు తెలుగు సినిమా స్థాయిని వ్యాపార పరంగానే కాకుండా, కళాత్మక పరంగా కూడా ఉన్నత స్థానంలో నిలబె డతాయన్నది కాదనలేని నిజం. కేవలం కల్పిత కథలతోనే కాకుండా వాస్తవ గాథలతో కూడా మెప్పిం చగలమని నిరూపించాల్సిన సమయం ఇది. నార్త్ మార్కెట్‌లో టాలీవుడ్ బ్రాండ్ ఇమేజ్ స్థిరపడాలంటే బయోపిక్స్ ప్రధాన వనరుగా మారుతాయి. ఆ దిశగా ఇక్కడ దర్శక , నిర్మాతలు ఎప్పుడు ముందడుగు వేస్తారో చూడాలి.