సీనియ‌ర్ న‌టుడు సంచ‌ల‌న‌ నిర్మాత‌గా ఎంట్రీ!

ఇండ‌స్ట్రీలో ఓ సీనియ‌ర్ న‌టుడు జ‌ర్నీ ఇప్పుడెంతో ఆస‌క్తిక‌రం. అత‌డి కెరీర్ ని ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలిస్తే మూడు ఇన్నింగ్స్ ల్లా క‌నిపిస్తోంది.;

Update: 2026-02-25 05:45 GMT

ఇండ‌స్ట్రీలో ఓ సీనియ‌ర్ న‌టుడు జ‌ర్నీ ఇప్పుడెంతో ఆస‌క్తిక‌రం. అత‌డి కెరీర్ ని ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలిస్తే మూడు ఇన్నింగ్స్ ల్లా క‌నిపిస్తోంది. హీరోగా ప‌రిశ్ర‌మ‌కు ఎంట్రీ ఇవ్వ‌డం కొన్ని సినిమాలు చేయ‌డం అటుపై అవ‌కాశాలు త‌గ్గ‌డంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ట‌ర్నింగ్ తీసుకున్నారు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మాత్రం అత‌డి కెరీర్ లో పీక్స్ చూస్తున్నారు. స్టార్ హీరోల‌ చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు. ఇప్ప‌టికీ అదే ప్ర‌యాణం ఇంకా సాఫీగానే సాగుతోంది. అయితే ఈ జ‌ర్నీలో అత‌డి జీవితంలో కొన్ని అనుకోని సంఘ‌ట‌న‌లు కూడా చోటు చేసు కున్నాయి.

అవ‌న్నీ అత‌డి వ్య‌క్తిగ‌త విష‌యాలు. కానీ ఈ ఘ‌ట‌నల త‌ర్వాత అత‌డి వ్య‌క్తిగ‌త జీవితంలో చాలా మార్పులొ చ్చాయి. ఆరోగ్యం స‌హా ఆహార్యం విష‌యాల్లో ఎన్నో మార్పులు చేసారు. లుక్ ప‌రంగా అత‌డి ట్రాన్ప‌ప‌ర్మేష‌న్ ఓషాకింగ్.

60 ఏళ్ల వాస్త‌వ వ‌య‌సు అయినా? 30 ఏళ్ల కుర్రాడిలా ఓ సంచ‌ల‌నం అవుతున్నారు. న‌టుడిగా అవ‌కాశాలు కూడా పెరిగాయి. ఇండ‌స్ట్రీలో కొత్త బాధ్య‌త‌లు కూడా చేప‌డుతున్నారు. సోష‌ల్ మీడియాలోనూ సంచ‌ల‌నంగా మారుతున్నారు. ఇదంతా ప‌క్క‌న బెడితే తాజాగా ఆ సీనియ‌ర్ న‌టుడు సంచ‌ల‌నం తీసుకున్న‌ట్లు తెలిసింది.

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొత్త ప్ర‌యాణానికి శ్రీకారం చుడుతున్న‌ట్లు వినిపిస్తోంది. టాలీవుడ్ నిర్మాణ సంస్థ‌ను స్థాపించి సినిమాలు నిర్మించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌న్నిహితుల నుంచి తెలిసింది. అదే జ‌రిగితే ఆ సీనియ‌ర్ న‌టుడి కొత్త ప్ర‌యాణం మొద‌లైన‌ట్లే. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇండ‌స్ట్రీ నుంచి న‌టుడిగా తీసుకోవ‌డ‌మే త‌ప్ప ప‌రిశ్ర‌మ కోసం ఖ‌ర్చు చేసింది లేదు. నిర్మాత‌గా ప్ర‌యాణం మొద‌లు పెడితే? క‌ళాకారులకు మ‌రో ఆప‌న్న హ‌స్తం దొరికిన‌ట్లే. న‌వ‌త‌రం క‌ళాకారుల‌ను వెలుగులోకి తెచ్చిన‌ట్లు అవుతుంది. ఆ న‌టుడి త‌ల్లిదండ్రులు ఇండ‌స్ట్రీకి ఎంతో ఇచ్చారు.

ద‌ర్శ‌క‌, నిర్మాత‌లుగా ఓ వెలుగు వెలిగిన వారే. అదే కుటుంబం నుంచి వార‌సుడి రూపంలో నిర్మాత‌గా ప్ర‌వేశం ఆ సీనియ‌ర్ న‌టుల‌కు మ‌రింత సంతోషాన్ని క‌లిగించే విష‌య‌మే. ఎలాంటి సినిమాలు నిర్మించే అవ‌కాశం ఉందంటే? ఆస‌క్తికరంగా ఆ న‌టుడు బాగా స్థిర‌ప‌డిన వారే. భారీ ఆస్తిపాస్తులున్న న‌టుడిగా పేర్కొంటారు. త‌ల్లిదండ్రుల నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చిన ఆస్తే వేల కోట్లు ఉంటుంద‌ని చెబుతారు. మ‌రి మారిన సినిమా నిర్మాణం నేప‌థ్యంలో భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మిస్తారా? చిన్న సినిమాల‌తో మొద‌లై అగ్ర హీరోల చిత్రాల వైపు అడుగులు వేస్తారా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతానికైతే ఆ సీనియ‌ర్ న‌టుడు న‌టుడిగా బిజీగానే ఉన్నారు.

Tags:    

Similar News