సంక్రాంతి త‌ర్వాత స‌మ్మ‌ర్ స‌మ‌ర‌మే!

ఈ సంక్రాంతి సీజ‌న్ `ఆల్కాహాల్` రిలీజ్ తో మొద‌లువుతుంది. అటుపై జ‌న‌వ‌రి 9న `రాజాసాబ్`, `జ‌న నాయ‌గ‌న్` పోటీ బ‌రిలో ఉన్నాయి.;

Update: 2025-11-22 22:30 GMT

ఈ సంక్రాంతి సీజ‌న్ `ఆల్కాహాల్` రిలీజ్ తో మొద‌లువుతుంది. అటుపై జ‌న‌వ‌రి 9న `రాజాసాబ్`, `జ‌న నాయ‌గ‌న్` పోటీ బ‌రిలో ఉన్నాయి. రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావ‌డంతో పోటీ క‌నిపిస్తోంది. అలాగే `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్రసాద్ గారు`, `భ‌ర్త మ‌హాయ‌శుల‌కు` లాంటి చిత్రాలు రేసులో ఉన్నాయి. ఆరెండు సినిమాల రిలీజ్ తేదీ ఖ‌రారు కావాల్సి ఉంది. సంక్రాతి టార్గెట్ గానే ఈ రెండు రిలీజ్ కానున్నాయి. అనంత‌రం `పరాశ‌క్తి`, `అన‌గ‌న‌గా ఒక రాజు` లాంటి చిత్రాలు నెల‌ఖారున రిలీజ్ అవుతాయి. దీంతో జ‌న‌వ‌రి రిలీజ్ లు పూర్త‌వుతాయి.

ఒక్క రోజు గ్యాప్ లో ఆ ఇద్ద‌రు:

అనంత‌రం సమ్మ‌ర్ హీట్ మొద‌లు కానుంది. ఫిబ్ర‌వ‌రిలో ఇంత వ‌ర‌కూ ఎలాంటి రిలీజ్ లేవు. దీంతో అస‌లైన వేడి మార్చి నుంచి మొదలు కానుంది. మార్చి 19న `డెకాయిట్`, `టాక్సిక్` రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల‌పై పాన్ ఇండియాలో భారీ అంచ‌నాలున్నాయి. రెండు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్లు కావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద ట‌ఫ్ పైట్ త‌ప్ప‌దు. అదే నెల 26న నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తోన్న `ది ప్యార‌డైజ్` భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతుంది. అనంత‌రం ఒక్క రోజు గ్యాప్ లోనే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తోన్న `పెద్ది` పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది.

అన్న‌ద‌మ్ములిద్ద‌రు ఒకేసారి:

ప్యార‌డైజ్ కూడా పాన్ ఇండియా రిలీజ్ కావ‌డంతో? ర‌ఎండు సినిమాల మ‌ధ్య పోటీ త‌ప్ప‌దు. ఇక ఏప్రిల్ రెండ‌వ వారంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న `ఉస్తాద్ భగత్ సింగ్` రిలీజ్ కానుంది. రిలీజ్ తేదీ ప్ర‌క‌టించాల్సి ఉంది. ఆ సినిమా రిలీజ్ అనంత‌రం చిరంజీవి హీరోగా న‌టిస్తోన్న `విశ్వంభ‌ర‌` కూడా రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో జాప్యంగా కార‌ణంగా డిలే అయింది. ఏప్రిల్ లో మాత్రం పక్కా రిలీజ్ అని చిత్ర వ‌ర్గాల నుంచి తెలిసింది. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న` డ్రాగ‌న్` కూడా స‌మ్మ‌ర్ బరిలో నిలిచే అవ‌కాశం ఉంది.

స్టార్స్ తో పాటు టైర్ 2 హీరోలు:

`దేవ‌ర` త‌ర్వాత తారక్ నుంచి రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావ‌డంతో? అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇక మేలో మేలో `ఫంకీ`, `గుడ‌ఛారి 2` లాంటి చిత్రాలు రేసులో ఉన్నాయి. మొత్తంగా ఈ స‌మ్మ‌ర్ లో రిలీజ్ లు భారీగానే క‌నిపిస్తున్నాయి. కొత్త రిలీజ్ ల‌తో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడున్నాయి. ఈ ఏడాది స‌రై స‌మ్మ‌ర్ రిలీజ్ లు లేక‌పోవ‌డంతో థియేట‌ర్లు వెల‌వెల‌బోయిన సంగ‌తి తెలిసిందే. 2026 వేస‌వి మాత్రం హీటెక్క‌డం ఖాయం.

Tags:    

Similar News