ఏడాదికి ఒక్క సినిమా జరిగేపని కాదు!
ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ చేయాలని స్టార్ హీరోలంతా ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. ఇది విని విని అభిమానులకు కూడా బోర్ కొట్టేసింది.;
ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ చేయాలని స్టార్ హీరోలంతా ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. ఇది విని విని అభిమానులకు కూడా బోర్ కొట్టేసింది. అది మాటల వరకే పరిమితం. చేతల వరకూ సాధ్యం కాదని ఓ అంచనాకి వచ్చేసారు. అభిమానులు కూడా ఆ విషయాన్ని మర్చిపోయారు. కానీ హీరోలు మాత్రం మర్చిపోలేదండోయ్. ఇప్పటికీ చేస్తామనే అంటారు. కానీ అది జరగదు. ప్రస్తుతం కనీసం రెండేళ్లకైనా ఓ సినిమా చేయగల్గుతున్నారు.
ఇకపై అది కూడా సాధ్యం కాదు. వాళ్ల నుంచి సినిమాలు రిలీజ్ అవ్వాలంటే రెండున్నరేళ్లకు పైగానే సమయం పడుతుంది. ప్రస్తుతం హీరోలంతా పాన్ ఇండియా మోజులో ఉన్నారు. ఒక్క సినిమాతో అన్ని భాషల్లోనూ సత్తా చాటే ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, మహేష్ ఇలా ఫస్ట్ క్లాస్ హీరోలంతా ఇదే వ్యూహంతో ఉన్నారు. రిలీజ్ ఆలస్యమైనా పర్వాలేదు హిట్ కంటెంట్ మాత్రమే అందించాలని దర్శక, నిర్మాతలకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు.
అవసరమైతే రెండు సినిమాలు వదలుకోవడనికి సిద్దంగా ఉంటున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో నిర్మాత బన్నీ వాస్ స్టార్ హీరోలందరికీ చురకలంటిచిన సంగతి తెలిసిందే. పెద్ద హీరోలంతా రెండేళ్లకు .మూడేళ్లకు ఒకే సినిమా రిలీజ్ చేస్తుంటే? థియేటర్ వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించాడు. థియేటర్ ఆక్యుపెన్సీ అన్నది ఎలా ఉందో హీరోలంతా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని సూచిం చాడు.
మరి ఈ వ్యాఖ్యల్ని ఎంత మంది పట్టించుకుంటారు? అన్నది చూడాలి. ఇప్పటికే స్టార్ హీరోలంతా పారితోషికం తగ్గించుకోవాలనే డిమాండ్ ఉంది. సినిమా నిర్మాణ వ్యయం నిర్మాతకు భారంగా ఉందని పెట్టుబడిలో పావు వంతు హీరో పారితోషికంగానే పోతుందనే మాట ఎప్పటి నుంచో ఉంది. మరి ఈ పరిస్థితులన్నింటిపై స్టార్ హీరోలంతా కూర్చుని ఆలోచిస్తారేమో చూడాలి.