ఎస్ అని చెప్ప‌లేం..నో అని చెప్ప‌లేం!

మ‌రి ఈ రీ -రిలీజ్ ల‌ను ప్రేక్ష‌కులు చూస్తున్నారా? అంటే ఎస్ అని చెప్ప‌లేము..నో అని అన‌లేము అన్న‌ట్లే ఉంది స‌న్నివేశం.;

Update: 2025-11-18 07:30 GMT

మూడేళ్లగా రీ-రిలీజ్ లు పెద్ద ఎత్తున జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. తొలుత‌ సినిమా హీరో పుట్టిన రోజు వేడుక‌ల‌కు లేదంటే రిలీజ్ అయి 25 ఏళ్లు..ప‌దేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగానూ రీ-రిలీజ్ లు జ‌రిగేవి. కానీ నేడు అందుకు భిన్నంగా రీ- రిలీజులు జ‌రుగుతున్నాయి. స‌మ‌యం సంద‌ర్భం లేకుండానే రీ-రిలీజులు జ‌రుగుతున్నాయి. మ‌రి ఈ రీ -రిలీజ్ ల‌ను ప్రేక్ష‌కులు చూస్తున్నారా? అంటే ఎస్ అని చెప్ప‌లేము..నో అని అన‌లేము అన్న‌ట్లే ఉంది స‌న్నివేశం. ఇక్క‌డ నో అంటే `బాహుబ‌లి ది ఎపిక్` రీ-రిలీజ్ లో రికార్డులు తిర‌గ రాయ‌దుగా. రీ-రిలీజ్ లో ఈ సినిమా ఏకంగా 50 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసిందంటే ఎంత పెద్ద రీ-రిలీజ్ గా చెప్పొచ్చో అంచ‌నా వేయోచ్చు.

ఆ సినిమాలు గ్రాండ్ స‌క్సెస్ :

దీంతో పాటు 'పోకిరి', 'ఖుషీ', 'జ‌ల్సా', 'ఆరెంజ్', 'ఖ‌లేజా', 'జగ‌దీక వీరుడు అతిలోక సుంద‌రి' లాంటి సినిమాలు రీ-రిలీజ్ లో మంచి వ‌సూళ్ల‌ను సాధించాయి. తాజాగా 36 ఏళ్ల త‌ర్వాత నాగార్జున హీరోగా రాంగోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'శివ'  రీ-రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం రాంగోపాల్ వ‌ర్మ ఆరు నెల‌ల పాటు, ప‌ని చేసారు. 4కె ఫార్మెట్ లో ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వ‌డం కోసం వ‌ర్మ బ్యాకెండ్ లో ఎంతో వ‌ర్క్ చేసారు. అటుపై పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసారు. ఈ సినిమా ప్రచారం కోసం దాదాపు ఇండ‌స్ట్రీ అంతా పాల్గొంది. దీంతో భారీ అంచ‌నాల మ‌ధ్య రీ-రిలీజ్ జ‌రిగింది.

రీ-రిలీజ్ లో కొంద‌రే స‌క్సెస్:

ఈ సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌ధ్మ‌ర‌ధం ప‌ట్టారు. కాలేజ్ రాజ‌కీయ నేప‌థ్య క‌థ కావ‌డంతో నెటి జ‌న‌రేష‌న్ యువ‌త‌కి బాగా క‌నెక్ట్ అయింది. అక్కినేని అభిమానులు , `శివ` అభిమానులు పెద్ద ఎత్తున అద‌రించారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ ఎత్తున జ‌ర‌గ‌డంతో పెద్ద విజ‌యం దిశ‌గా ముందుకెళ్తోంది. అలాగే రీ-రిలీజ్ లో ఆద‌ర‌ణ‌కు నోచుకోని చాలా చిత్రాలున్నాయి. ఎన్టీఆర్, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బ‌న్నీ, చిరంజీవి, వెంక‌టేష్ న‌టించిన కొన్ని సినిమాలు కూడా రీ-రిలీజ్ అయ్యాయి. కానీ వాటికి అనుకున్నంత‌గా రెస్పాన్స్ రాలేదు. అలాగ‌ని అవేమి అప్ప‌ట్లో యావ‌రేజ్ హిట్లు కాదు.

ప్రేక్ష‌కుల ప‌ల్స్ ప‌ట్టుకోలేక‌పోతున్నారా:

భారీ విజ‌యం సాధించిన చిత్రాలే రీ -రిలీజ్ కు వ‌చ్చాయి. కానీ ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా రాలేదు. దీంతో అన్ని రీ-రిలీజ్ లు కూడా వంద‌శాతం విజ‌యం సాధిస్తాయి? అని ఎన‌లిస్టులు ఖ‌చ్చితంగా చెప్ప‌లేక‌పోతున్నారు. రీ-రిలీజ్ కు స‌మ‌యం కూడా అంతే కీల‌కం అంటున్నారు. అప్ప‌టికి థియేట‌ర్లు ఖాళీగా ఉండి రీ-రిలీజ్ లు చేస్తే కొన్ని చిత్రాలు రాణిస్తున్నాయ‌ని..కొన్ని స‌క్సెస్ అవ్వ‌డం లేదంటున్నారు. ఈ విష‌యంలో ప్రేక్ష‌కుల మైండ్ సెట్ ను అంచ‌నా వేయ‌డం క‌ష్ట‌మ‌వుతుందంటున్నారు.

Tags:    

Similar News